RRR HighLights : రాజమౌళి, చరణ్, NTR ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్ ఇవే

మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.

RRR HighLights : రాజమౌళి, చరణ్, NTR ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్ ఇవే

Rrr Press Meet Highlights

RRR Movie: రౌద్రం-రణం-రుధిరం(RRR) మూవీ టీమ్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికరమైన అంశాలను వివరించారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ ఆలియాభట్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. వారు మాట్లాడిన సందర్భ క్రమంలో హైలైట్ పాయింట్స్ ఏంటో తెల్సుకుందాం.

మొన్నటి సభలో ఇబ్బంది పెట్టిన ఈవెంట్ మేనేజర్ ను ఉద్యోగం నుంచి తీసేశాం- రాజమౌళి

ఇద్దరు హీరోల బైక్ చేజ్ సీన్ ను ఫస్ట్ షాట్ గా తీశా-రాజమౌళి

4 భాషల్లో డబ్బింగ్ చెప్పాను. మాకు తెలిసిన భాషలే కాబట్టి కష్టం అనిపించలేదు. మలయాళాన్ని ఖూనీ చేసినట్టు రాజమౌళి చెప్పారు. అందుకే చెప్పలేదు – ఎన్టీఆర్

10 భాషల్లో మూవీ రిలీజ్ అవుతోంది. మన హీరోలు 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు – రాజమౌళి.

ట్రైలర్ పగిలిపోయింది కదా.. ముంబైలో మాకు పిచ్చెక్కింది- ఆలియా భట్

పాండెమిక్ మమ్మల్ని, RRRను మాత్రమే కాదు.. ప్రపంచమంతటినీ ఇబ్బందిపెట్టింది. ప్రాణాలు పోతుంటే గుండె తరుక్కుపోయింది. ఐనా పూర్తిచేశాం- రాజమౌళి

తెలంగాణ యాస పెద్ద కష్టమనిపించలేదు. తెలిసిందే.. ఇక్కడే ఉంటున్నాం. గోండుల గోడును RRRలో డైరెక్టర్ చూపించారు. వారి స్థానిక భాషపై పట్టున్న రాజమౌళి దగ్గరుండి డబ్బింగ్ చెప్పించారు – ఎన్టీఆర్.

ఏపీ ప్రభుత్వం పెట్టిన టికెట్ రేట్లతో సినిమా వేయడం కష్టం- డీవీవీ దానయ్య

రాజమౌళి చెప్పినట్టు చేస్తే చాలు మాకు 100 మార్కులు పడ్డట్టే- రామ్ చరణ్

ట్రిపుల్ ఆర్ అంటేనే కమిట్ మెంట్. కష్టపడి.. అవాంతరాలు ఎదుర్కొని మూవీ చేశాం. పాండెమిక్ లో మాకు వేరే ఆప్షన్ లేదు. పెద్ద అవాంతరం కాబట్టి.. RRRవస్తేనే అందరి జీవితాలు మళ్లీ సెటిల్ అవుతాయన్న లక్ష్యంతో పనిచేశాం. మా ధ్యాస అంతా క్యారెక్టర్ లోకి ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్నట్టుండేది – ఎన్టీఆర్

వీరులతో నాటు స్టెప్పులు, డ్యాన్సులు వేయిస్తారా అని క్వశ్చన్స్ వస్తాయని తెలుసు. ఐతే.. మీకు లిరికల్ సాంగ్ లో కొంత మాత్రమే చూపించాం. ఆ పాట పూర్తిగా థియేటర్లో చూస్తే మాట కూడా మాట్లాడరు. అంతర్గతంగా ఓ ఎమోషన్ క్యారీ అవుతుంది. అది చూశాక ఈ విమర్శలు చేయరు- రాజమౌళి.

ఫ్యాన్స్ అన్నాక.. ఎన్టీఆర్-రామ్ చరణ్ లను కంపేర్ చేస్తారు. ఆయన ఎన్ని గుద్దులు గుద్దాడు.. ఈయన ఎన్ని తన్నులు తన్నాడు.. అని లెక్కలు వేస్తారు. ఐతే.. సినిమా చూశాక.. ఈ కౌంట్ ను ఫ్యాన్స్ మరిచిపోతారు. – రాజమౌళి

గోండులు, ఆదివాసీల హక్కుల గురించి పోరాడిన ఇద్దరు హీరోల పాత్రలు మాత్రమే తీసుకున్నాం. అజ్ఞాతంలోకి వెళ్లిన 3,4 ఏళ్లలో వీళ్లిద్దరి కలిసి పోరాడితే ఎలా ఉంటుందని పూర్తిగా ఊహించి తీసిన సినిమా ఇది. అందుకే ఎవరి హిస్టరీని, ఫ్యామిలీని మేం కలవలేదు. ఎటువంటి వివాదాలు రావనే అనుకుంటున్నా- రాజమౌళి.

ఒకటే మాట.. ఎమోషన్ తో జనాలను పిండేశాం. ఇద్దరు గొప్ప స్వాతంత్య్ర సంగ్రామ యోధుల పేర్లు వాడటంలో నేను ఇబ్బందికి, ఒత్తిడికి లోనుకాలేదు. పైగా నా చేతికి 2 ఆటం బాంబులు దొరికాయని సంబరపడ్డాను. వారి హీరోయిజాన్ని ఏ రేంజ్ లో చూపించాలో.. ఎమోషన్ ఏ స్థాయిలో ఎలివేట్ చేయాలో.. ఆ రేంజ్ లో చూపించాను. – రాజమౌళి

ఇద్దరు హీరోలతో మొదటిసారి సోఫా ఫొటో మరిచిపోలేను. ఒకరికి చెప్పకుండా మరొకరిని పిలిచాను. ఇద్దరితో సినిమా తీద్దామనుకుంటున్నానని చెప్పేసరికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఎన్నిరోజులైనా గుర్తుండిపోతాయి- రాజమౌళి

సిరివెన్నెలతో పాట రాయించుకోవాలంటే.. నేపథ్యం, క్యారెక్టర్లు, సందర్భం… అన్నీ చెప్పాల్సిందే. లేకపోతే అవతలికి పో అంటారాయన. నాకు పాట రాసి ఇవ్వాలంటే మాత్రం కనీసం 2,3 నెలలు తీసుకుంటారు. దోస్తీ పాటకు సిరివెన్నెల గొప్ప సాహిత్యం ఇచ్చారు. – రాజమౌళి

ఈ సినిమాలో రొమాన్స్ ప్లేస్ లో బ్రొమాన్స్(ఇద్దరు స్నేహితుల మధ్య అన్నదమ్ముల అనుబంధం) ఉంటుంది -రాజమౌళి

థియేటర్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కొద్ది నిమిషాలకో క్లారిటీతో యూట్యూబ్ లో వచ్చేసింది. మాకు భయం వేసింది. అందుకే… సాయంత్రం కాకుండా ఉదయం 11 గంటలకే యూట్యూబ్ లో రిలీజ్ ప్రకటించేశాం. దీనికి పూర్తిగా మా సోషల్ మీడియా టీందే బాధ్యత-రాజమౌళి(నవ్వుతూ)

సినిమాలో తమ్ముడైనా నిజానికి రామ్ చరణ్ కంటే.. ఏడాది జూనియర్ ఎన్టీఆరే పెద్ద- రాజమౌళి

ఫ్రెండ్‌షిప్ ను నటించలేం. పెద్దల మనస్పర్థలు మా మధ్య స్నేహాన్ని చెడగొట్టకూడదని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. తేడా వస్తే నటించలేం. దూరంగా ఉంటాం-రామ్ చరణ్