Ranveer Singh : సమంత మీద ఇష్టం మరింత పెరుగుతుంది.. ఆమెతో సినిమా చేయాలి..

ఈ చర్చ కాస్తా రణ్‌వీర్ సింగ్ దాకా వెళ్ళింది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో సమంత ఇలా చెప్పింది, దానికి మీరేమంటారు అని రణ్‌వీర్ ని అడిగారు. రణ్‌వీర్ మాట్లాడుతూ.. ''నటిగా సమంత అంటే నాకు చాలా ఇష్టం.

Ranveer Singh : సమంత మీద ఇష్టం మరింత పెరుగుతుంది.. ఆమెతో సినిమా చేయాలి..

Samantha :  సమంత ఇటీవల బాలీవుడ్ మీద బాగా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి హీరోల గురించి పొగుడుతూ, అక్కడ ఈవెంట్స్ షోలలో పాల్గొంటూ ముంబైలో సెటిల్ అవ్వడానికి చూస్తుంది. రీసెంట్‌గా కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొంది సమంత. ఇందులో కరణ్ జోహార్ సమంతను.. నువ్వు బ్యాచిలరేట్ పార్టీని హోస్ట్ చేస్తే అక్కడ ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేస్తావు అని అడిగాడు. దీనికి సమంత సమాధానమిస్తూ.. రెండు సార్లు కూడా రణ్‌వీర్ సింగ్ అనే చెప్పింది. దీంతో రణ్‌వీర్ అంటే సమంతకి ఇష్టం అని, ఫేవరేట్ అని, రణ్‌వీర్ తో కలిసి నటించాలనుకుంటుందని బాలీవుడ్ లో బాగా చర్చ జరిగింది.

Koffee with Karan : కరణ్ సెక్స్ ప్రశ్నలకి కౌంటర్ ఇచ్చిన అమీర్ ఖాన్

 

ఈ చర్చ కాస్తా రణ్‌వీర్ సింగ్ దాకా వెళ్ళింది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో సమంత ఇలా చెప్పింది, దానికి మీరేమంటారు అని రణ్‌వీర్ ని అడిగారు. రణ్‌వీర్ మాట్లాడుతూ.. ”నటిగా సమంత అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉంది. సమంత అద్భుతమైన మనిషి, వ్యక్తిగా ఆమెపై ఉన్న ఇష్టం మరింత పెరుగుతోంది. సమంత ఎప్పుడూ చాలా జోవియల్ గా ఉంటూ, జోకులేస్తూ పక్కన ఉన్న వారిని నవ్విస్తుంది. మేమిద్దరం గతంలో కలిసి ఓ యాడ్ షూట్ చేశాం. మొదటిసారి ఆ యాడ్ షూట్ లోనే కలిశాం. ఆ తర్వాత మరింత క్లోజ్ అయ్యాము. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది” అని తెలిపాడు. దీంతో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై సమంతతో పాటు సామ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.