Rashmika Mandanna : రష్మికపై అక్కడ బ్యాన్..? ట్వీట్ చేసిన ఫిలిం క్రిటిక్.. నిజమేనా??
ఈ వివాదంతో రష్మిక కన్నడ భామ అయినా కన్నడలో సినిమాలు చేయట్లేదని, కన్నడ సినీ పరిశ్రమని బయట అవమానపరుస్తుందని కన్నడ ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ అయిన...............

Rashmika Mandanna ban in kannada industry news goes viral
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. రష్మిక కన్నడ భామ. తన మొదటి సినిమా కన్నడలో కిరాక్ పార్టీ. ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఇటీవల వచ్చిన కాంతార సినిమా డైరెక్టర్, హీరో కూడా రిషబ్ శెట్టినే. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని కన్నడ పరిశ్రమలో టాక్.
అయితే ఇటీవల రష్మిక వివాదంలో చిక్కుకుంది. ముంబైలో ఓ రిపోర్ట్రర్ రష్మికని కాంతార సినిమా చూశారా అని అడగగా చూడలేదు, టైం లేదు అని చెప్పింది. అంతేకాకుండా మరో ఇంటర్వ్యూలో మీకు మొదటి ఛాన్స్ ఎలా వచ్చింది అంటే రిషబ్ పేరు చెప్పకుండా తన ఫోటో చూసి ఓ ప్రొడక్షన్ హౌజ్ వాళ్ళు పిలిచారు అని చెప్పింది. వీరిద్దరి మధ్య ఉన్న వివాదం వల్లే రష్మిక అలా చెప్పిందని అంటున్నారు. రిషబ్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు ఎవరితో సినిమాలు తీద్దామనుకుంటున్నారు అని కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్పగా అందులో రష్మిక పేరు తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పి షాక్ ఇచ్చాడు రిషబ్.
Samantha : యశోద ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ.. సమంతపై పరువునష్టం దావా..
ఇలా వీళ్ళ వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంతో రష్మిక కన్నడ భామ అయినా కన్నడలో సినిమాలు చేయట్లేదని, కన్నడ సినీ పరిశ్రమని బయట అవమానపరుస్తుందని కన్నడ ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ అయిన ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చగా మారింది. కన్నడ సినీ పరిశ్రమకి రష్మిక గౌరవం ఇవ్వట్లేదని, తమ సినీ పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడుతుందని రష్మికని కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది నెటిజన్లు ఇది ఫేక్ న్యూస్ అని, రష్మికని కన్నడలో బ్యాన్ చేయలేదని అంటున్నారు. మరి నిజంగానే రష్మికని కన్నడలో బ్యాన్ చేశారా అనేది తెలియాలి. దీనిపై రష్మిక మాత్రం ఇంకా స్పందించలేదు.
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022