Rathika Rose : బిగ్‌బాస్ నుంచి ఈ వారం హాట్ బ్యూటీ ఎలిమినేట్ అవ్వబోతుందా? టాప్ లో ఉంటుంది అనుకున్నారు..

బిగ్‌బాస్ 7 లో నాలుగోవారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు.

Rathika Rose : బిగ్‌బాస్ నుంచి ఈ వారం హాట్ బ్యూటీ ఎలిమినేట్ అవ్వబోతుందా? టాప్ లో ఉంటుంది అనుకున్నారు..

Rathika Rose will eliminate from Bigg Boss 7 in this Fourth Week

Updated On : October 1, 2023 / 7:31 AM IST

Rathika Rose :  బిగ్‌బాస్ లో ఆదివారం ఎపిసోడ్ రానుంది అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. హౌస్ లో 14 మంది రాగా ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటిదాకా బిగ్‌బాస్ 7 నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని.. ఇలా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని సమాచారం.

బిగ్‌బాస్ 7 లో నాలుగోవారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు. వీరిలో రతిక ఈవారం ఎలిమినేట్ అవుతుందని టాక్. ప్రశాంత్ – రతిక ఎపిసోడ్ తో బిగ్‌బాస్ కి మంచి మైలేజ్ వచ్చింది. ఇక రతిక రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలియడంతో మరింత వైరల్ అయింది. సోషల్ మీడియాలో తన అకౌంట్లో హాట్ హాట్ ఫొటోలతో పాటు హౌస్ లో కూడా రతిక తన బ్యూటీని చూపించడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయి హౌస్ లో ఉన్న అందరికంటే బాగా పాపులర్ అయింది.

Also Read : Bigg Boss 7 Day 27 : సందీప్, శివాజీలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ మొత్తం శివాజీ పైనే..

అయితే ఇప్పుడు రతిక ఎలిమినేట్ అవుతుంది అనడంతో కచ్చితంగా బిగ్‌బాస్ మీదే ఎఫెక్ట్ ఉంటుంది. బిగ్‌బాస్ చూసేవాళ్ళు తగ్గిపోతారు అని అనుకుంటున్నారు. అలాగే రతిక అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా రతిక ఎలిమినేట్ అయినట్టు, ఇంకో ఛాన్స్ ఇవ్వాలని, అమర్ దీప్ వల్లే రతిక ట్రాక్ తప్పిందని, కొంతమంది హౌస్ లో రతికని నెగిటివ్ గా చిత్రీకరించారని అని పోస్ట్ పెట్టారు. ముందే ఎలిమినేట్ అయినట్టు చెప్పడం బిగ్‌బాస్ రూల్స్ కి ఇది పూర్తిగా విరుద్ధం. దీంతో ఆ పోస్ట్ వెంటనే తొలిగించారు. ఒకవేళ అది నిజమే అయి రతిక నిజంగానే ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ కే ఎఫెక్ట్, ఆమెకి బయటకి వచ్చాక ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారు ఆమె ఫ్యాన్స్, ప్రేక్షకులు.

View this post on Instagram

A post shared by Rathika (@rathikarose_official)