Khiladi : రవితేజ ‘ఖిలాడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇటీవలే రవితేజ నుంచి 'ఖిలాడీ' సినిమా వచ్చింది. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 'ఖిలాడీ'లో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమేష్ వర్మ.....

Khiladi : రవితేజ ‘ఖిలాడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Raviteja :  రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చేతిలో దాదాపు అరడజను పైగానే సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు రవితేజ. ఇటీవలే రవితేజ నుంచి ‘ఖిలాడీ’ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ‘ఖిలాడీ’లో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో భారీ అంచనాల మధ్య ‘ఖిలాడీ’ రిలీజ్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది.

Nandini Reddy : నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు.. సమంత ఎమోషనల్ పోస్ట్..

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదలైన నెల రోజులకి ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఖిలాడి సినిమా మార్చి 11 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మేరకు హాట్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. రవితేజ అభిమానులు మాత్రం మరోసారి ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు సిద్ధమైపోయారు.