పవర్‌స్టార్ ట్రైలర్ రిలీజ్డ్.. : 10TV ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన RGV

పవర్‌స్టార్ ట్రైలర్ రిలీజ్డ్.. : 10TV ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన RGV

రామ్ గోపాల్ వర్మ డైరక్షన్‌లో ‘పవర్ స్టార్’ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రిలీజ్ కానుంది. దీనిపై 10TVలో RGV ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పటిలాగే నేరుగా సమాధానం చెప్తున్నా అంటూనే నిగూడాలను దాస్తూ వచ్చారంటున్నారు విమర్శకులు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఏ గుట్టూ లేదంటూ ఈ సినిమా కేవలం కల్పితమని వెయ్యి శాతం కల్పిత పాత్రలతో పుట్టిందేనని చెప్పారు.

మీకు పవర్ స్టార్ అంటే అతి ప్రేమా.. అతి కోపమా…అని అడిగిన ప్రశ్నకు ఇది కేవలం ప్రొక్సిమిటీస్టార్ వర్చస్సు నుంచి పుట్టిందే కానీ ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. సినిమాలో క్యారెక్టర్ చేసిన వ్యక్తి పేరు ప్రవన్ కళ్యాన్. అతని నేచురల్ బాడీ లాంగ్వేజ్ నే సినిమాలో వాడాం. అంతే కానీ, ఎవరినీ ఇమిటిటే చేయలేదన్నారు.

సినిమాల్లో పెద్ద స్టార్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఓ పార్టీ పెట్టి దారుణంగా ఓడిపోతాడు. ఆ తర్వాత అతను ఓ పెద్ద డైరక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, పెద్దన్నయ్యలను కలిసి చర్చలు జరుపుతాడు. సినిమాలో అతను బాధపడుతూ ఫాం హౌజ్ లో గడుపుతుంటాడు. అక్కడ అతనికి స్నేహితులు గేదెలు, మొక్కలే. దీనికి సంబంధించి కూడా ఓ సాంగ్ రిలీజ్ చేశారు ఆర్జీవీ. దానినే ట్రైలర్ కింద విడుదల చేశారు. పైగా దీనికి రూ.25ఛార్జ్ చేస్తూ చరిత్ర సృష్టించారు.

సినిమా చూడాలంటే రూ.150చెల్లించాలని… అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ‘గడ్డి తింటావా.. తౌడు తింటావా.. నా బుజ్జి గేదమ్మా.. నువ్వు కుడితి తాగుతావా.. ‘ అంటూ పాట సాగుతుంది. దీనిని రాసింది కూడా వర్మేనట. కథ కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ. ప్రొక్సిమా సెంటోరీ పోల్చుకోలని నక్షత్రం గురించి తీసిన సినిమా. గత ముఖ్యమంత్రికి పోలిన క్యారెక్టర్, టీఎస్ అనే షార్ట్ నేమ్‌తో పెద్ద డైరక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ పాత్రలు ఇందులో కనిపిస్తాయి.

సత్య హరిశ్చంద్రుడు తర్వాత నేనే నిజాలు చెప్పే వ్యక్తిని ఇదే నిజం అని గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ చెప్పుకొచ్చారు వర్మ. సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక హీరో ఒక్క సీట్ కూడా రాలేదా.. అని అడుగుతాడు. అప్పుడు వేరే వ్యక్తి వచ్చింది కానీ, మీకు ఒకటి కూడా రాలేదంటాడు.

ఈ సినిమా త్వరగా రెడీ అయింది కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలనుకుంటున్నా. క్యారెక్టర్ చాలా అమాయకుడనేది కాదు. తెలివిలేని వాడికి అమాయకుడికి మధ్య స్వభావమే ఈ క్యారెక్టర్. క్యారెక్టర్లన్నింటికీ నిక్ నేమ్ లు ఉంటాయి. ప్రొడ్యూసర్ నెత్తినెక్కించేసుకుంటూ ఉంటాడు. అలా పొగిడేయడం వల్ల క్యారెక్టర్ మీద ప్రభావం కనిపిస్తుంది.

ట్రైలర్ కు రూ.25ఇచ్చి చూస్తారని నమ్ముతున్నా.. ఘట్స్ తోనే రిలీజ్ చేస్తున్నా. పేరు కోసమే ఛార్జి చేసి ట్రైలర్ చేస్తున్నా. ఫోర్సిబుల్ గా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే దానికి తగ్గట్లుగానే మేమూ యాక్షన్ తీసుకుంటాం. అని వర్మ అన్నారు.