కాష్మోరాతో కక్కుర్తి.. అర్ధరాత్రి మణికొండ మర్రిచెట్టు కింద ‘RGV రోజూ గిల్లేవాడు’..

  • Published By: sekhar ,Published On : August 10, 2020 / 03:18 PM IST
కాష్మోరాతో కక్కుర్తి.. అర్ధరాత్రి మణికొండ మర్రిచెట్టు కింద ‘RGV రోజూ గిల్లేవాడు’..

‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినీకార్ప్ సమర్పణలో.. ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు)’ చిత్రంలోని సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోని, ది 09-08-2020 ఆదివారం, అర్ధరాత్రి మణికొండ మర్రిచెట్టు కింద విడుదల చేసినట్లుగా దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు.



ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై‌న 2 వారాల్లోనే యూట్యూబ్ లో 20లక్షలమంది పైగా విని ఆనందించారని ఆయన పేర్కొన్నారు.
తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ‌తెలుగు సినీ పరిశ్రమనే అవమానిస్తున్న ‘తగుల్భాజీదర్శకదయ్యం’.. ‘నమక్ హ రాం’ ఘోపాలవర్మకి ఈ‌ రెండో పాటని అంకితం ఇచ్చినట్లు కవి, దర్శకుడు జొన్నవిత్తుల తెలియచేశారు. పూర్తిగా వర్మ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాటను జొన్నవిత్తుల రాయగా రేవంత్ పాడారు. వీణాపాణి సంగీతమందించారు.



కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, తేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.