‘రొమాంటిక్’ – ఫస్ట్‌లుక్

ఆకాష్ పూరీ, కేతిక శర్మ జంటగా.. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న'రొమాంటిక్' ఫస్ట్‌లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 30, 2019 / 06:50 AM IST
‘రొమాంటిక్’ – ఫస్ట్‌లుక్

ఆకాష్ పూరీ, కేతిక శర్మ జంటగా.. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న’రొమాంటిక్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, తండ్రి డైరెక్ట్ చేసిన ‘చిరుత’, ‘బుజ్జిగాడు’ లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.. ‘ఆంధ్రాపోరీ’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆకాష్ హీరోగా పూరీ డైరెక్ట్ చేసిన రెండవ సినిమా.. ‘మొహబూబా’ కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ఆకాష్ హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమా రూపొందుతుంది.

కేతికా శర్మ హీరోయిన్.. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. పూరీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. రీసెంట్‌గా ‘రొమాంటిక్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ ఒకరినొకరు హగ్ చేసుకుని.. తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో..

Read Also : సాహో : ‘బేబి వోంట్ యూ టెల్ మి’ – ఫుల్ వీడియో సాంగ్..

వెనక్కి తిరిగి ఉన్న హీరోయిన్‌ని టాప్‌లెస్‌గా చూపించారు. శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆకాష్ చాలా బాగా మేకోవర్ అయ్యాడు.