RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు...

RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!

Rrr Ott Release Date Fixed

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఇక భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దుమ్ములేపింది.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ దిశగా ఆల్బమ్

అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో తారక్‌ల నటవిశ్వరూపం, జక్కన్న మార్క్ స్టోరీ టెల్లింగ్, కీరవాణి బాణీలు కలగలిసి ఈ సినిమాకు బలంగా మారాయి. దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూసిన వారు చాలా మంది ఉన్నారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో పలు డేట్లు వినిపించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌పై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారా?

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ జీ5. ఈ చిత్రాన్ని మే 20న జీ5లో ప్రీమియం స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు ఈ సినిమా కోసం మరోసారి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా అంటున్నారు. చరణ్, తారక్, ఆలియా భట్‌లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, ఒలివియా మారిస్ ఇతర పాత్రల్లో నటించారు. డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. మరి ఆర్ఆర్ఆర్ ఓటీటీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.