RRR For Oscars: “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”.. ఇంకా ఛాన్స్ ఉంది!

గత కొన్నిరోజులుగా ఇండియా వైడ్ ట్రెండ్ అయిన విషయం "ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్". అన్ని అర్హతులు ఉన్నా.. RRRను ఎంపిక చేయకపోడానికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే 'ఆర్ఆర్ఆర్'ను భారత ప్రభుత్వం ఆస్కార్ కు నామినేట్ చేయకపోయినా, అవార్డుల బరిలో నిలిచేందుకు ఇంకా ఛాన్స్ ఉంది.

RRR For Oscars: “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”.. ఇంకా ఛాన్స్ ఉంది!

RRR still had a chance to Oscar Nominations

RRR For Oscars: గత కొన్నిరోజులుగా ఇండియా వైడ్ ట్రెండ్ అయిన విషయం “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”. ప్రపంచవ్యాప్తంగా RRR చూసిన ఆడియన్స్ అండ్ సినీ సాంకేతిక నిపుణులు.. ఈ సినిమా ఆస్కార్ ను గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయంటూ జ్యోష్యం చెప్పారు. కానీ భారత ప్రభుత్వం అందుకు ఆస్కారం లేకుండా ఇండియా తరుపు నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు గుజరాతీ సినిమాని ఎంపిక చేసి ‘ఆర్ఆర్ఆర్’కు చెక్ పెట్టింది.

RRR For Oscars: “RRR”ను ఆస్కార్ రేస్‌లో నుంచి తప్పించిన భారత ప్రభుత్వం.. రాజకీయం అంటున్న నెటిజెన్లు!

అన్ని అర్హతులు ఉన్నా.. RRRను ఎంపిక చేయకపోడానికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ను భారత ప్రభుత్వం ఆస్కార్ కు నామినేట్ చేయకపోయినా, అవార్డుల బరిలో నిలిచేందుకు ఇంకా ఛాన్స్ ఉంది. ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమైనా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారం పాటు ప్రదర్శించబడితే చాలు. ఆ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలవచ్చు.

కాబట్టి RRR జనరల్ ఎంట్రీ కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలవచ్చు. ఈ కేటగిరిలో నామినేట్ చేసుకోడానికి నవంబర్ 15 వరకు అవకాశం ఉంది. మరి మూవీ టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా ఇటీవల దర్శకుడు రాజమౌళిని “టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌”లో ఆస్కార్ గురించి ప్రశ్నించగా.. ఆస్కార్ వచ్చినా, రాకపోయినా నా తదుపరి సినిమాల్లో మార్పు ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.