RRR – Saaho : ‘సాహో’ను దాటేసిన ‘ఆర్ఆర్ఆర్’..!

ఈ రెండు సినిమాలు ఇండియా స్థాయిలో, కేవలం 24 గంటల్లో ఆల్‌ టైమ్ మోస్ట్ వ్యూవ్డ్ అండ్ మోస్డ్ లైక్డ్ వీడియోస్‌గా రికార్డ్ సెట్ చేశాయి..

RRR – Saaho : ‘సాహో’ను దాటేసిన ‘ఆర్ఆర్ఆర్’..!

Rrr Saaho

RRR – Saaho: తెలుగు సినిమా రికార్డుల పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒక సినిమా ఎన్ని సెంటర్లలో ఎన్నిరోజులు ఆడింది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనే లెక్కలు వేసేవాళ్లు. మారుతున్న టైం తో పాటు ఇండస్ట్రీ లెక్కలు కూడా మారుతుంటాయి.

ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా వ్యూస్, లైక్స్ వంటివి కూడా రికార్డుల్లో కీ రోల్‌గా మారాయి. మేకర్స్‌కి, ఆయా హీరోల ఫ్యాన్స్‌కి ఈ లెక్కలు భలే కిక్కుస్తుంటాయి కూడా.. రీసెంట్‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు మేకింగ్ వీడియోల పరంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయంటూ అభిమానులు నెట్టింట హంగామా చేస్తున్నారు. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ రెండు పార్టులతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ మీద ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా మేకింగ్ వీడియో ఇండియా లెవల్లో 24 గంటల్లో 6.07 మిలియన్ల వ్యూస్, 328K లైక్స్ సాధించింది.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో 6.2 మిలియన్ల వ్యూస్, 452K లైక్స్ తెచ్చుకుని ‘సాహో’ని దాటేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు ఇండియా స్థాయిలో, కేవలం 24 గంటల్లో ఆల్‌ టైమ్ మోస్ట్ వ్యూవ్డ్ అండ్ మోస్డ్ లైక్డ్ వీడియోస్‌గా రికార్డ్ సెట్ చేశాయి.