Saakini Daakini: ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘శాకిని డాకిని’..!

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శాకిని డాకిని’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ వేళ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ప్లాట్‌ఫాం గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.

Saakini Daakini: ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘శాకిని డాకిని’..!

Saakini Daakini: టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శాకిని డాకిని’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు అంచనాలను రెట్టింపు చేశాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్‌తోనూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు.

Saakini Daakini Trailer : కామెడీతో మొదలుపెట్టి యాక్షన్ తో అదరగొట్టిన రెజీనా, నివేదా.. శాకిని డాకిని ట్రైలర్ రిలీజ్..

కాగా, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ వేళ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ప్లాట్‌ఫాం గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. శాకిని డాకిని చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌గా నెట్‌ఫ్లిక్స్ నిలిచింది. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి దీన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమయ్యింది.

Saakini Daakini: ‘శాకినీ డాకినీ’ల కోసం వస్తున్న మేజర్ అండ్ లేడీ డైరెక్టర్

ఇక ఈ సినిమాలో అందాల భామలు రెజీనా కాసాండ్రా, నివేదా థామస్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, పృథ్వీరాజ్, అమిత్ తివారీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కొరియన్ సూపర్ హిట్ మూవీ ‘మిడ్‌నైట్ రన్నర్స్’కు అఫీషియల్ రీమేక్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సురేష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది బాక్సాఫీస్ రిజల్ట్‌పై ఆధారపడింది.