Salaar : ఎట్టకేలకు ‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్రయూనిట్.. కొత్త డేట్..?

సలార్ వాయిదా పడిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏదో ఒకటి స్పందించండి అంటూ ప్రభాస్ అభిమానులు చిత్రయూనిట్ ని కోరుతున్నారు. ఎట్టకేలకు నేడు ఉదయం సలార్ సినిమా వాయిదాపై చిత్రయూనిట్ స్పందించింది.

Salaar : ఎట్టకేలకు ‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్రయూనిట్.. కొత్త డేట్..?

Salaar Movie unit gives clarity on Prabhas Salaar Postpone

Updated On : September 13, 2023 / 9:25 AM IST

Salaar Movie :  ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్ర‌భాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్ (Salaar). బాహుబలి 2 సినిమా తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సలార్ సినిమా అనేకసార్లు వాయిదా పడింది. సెప్టెంబర్ 28న సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ సలార్ సినిమా మళ్ళీ వాయిదా పడింది.

సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ ఏమి చెయ్యకపోవడం, అసలు చిత్రయూనిట్ దీనిపై స్పందించకపోవడంతో కొన్ని రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కాలేదని, సీజీ వ‌ర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం. చిత్రయూనిట్ ఇన్నాళ్లు అధికారికంగా స్పందించకపోయినా స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28కి విడుద‌ల కావ‌డం లేద‌ని, వాయిదా పడిందని అందరికి క్లారిటీ వచ్చేసింది. దీంతో వేరే చిన్న సినిమాలు అన్ని ఆ డేట్ కి తమ సినిమాల రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే సలార్ వాయిదా పడిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏదో ఒకటి స్పందించండి అంటూ ప్రభాస్ అభిమానులు చిత్రయూనిట్ ని కోరుతున్నారు. ఎట్టకేలకు నేడు ఉదయం సలార్ సినిమా వాయిదాపై చిత్రయూనిట్ స్పందించింది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సలార్ వాయిదాపై ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో.. సలార్ సినిమాకు సపోర్ చేస్తున్నందుకు మీ అందరికి దవ్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కావట్లేదు. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్రయూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని ప్రకటించారు.

Ram Charan – Upasana : పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్న చరణ్, ఉపాసన.. ఎవరికోసం వెళ్లారో తెలుసా?

వాయిదాపై క్లారిటీ ఇచ్చినందుకు ఓకే అనుకున్నా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానులు మళ్ళీ నిరాశ చెందుతూ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక సలార్ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని, ఇటీవల మొదటి పార్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ పెంచారు.