Salaar: అఖండను ఫాలో అవుతున్న సలార్.. ఊచకోత గ్యారెంటీ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సలార్ చిత్రంలో ప్రభాస్ కాళీ మాత భక్తుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

Salaar: అఖండను ఫాలో అవుతున్న సలార్.. ఊచకోత గ్యారెంటీ..?

Salaar To Have Akhanda Shades

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Salaar: సలార్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

కాగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సలార్ చిత్రంలో ప్రభాస్ కాళీ మాత భక్తుడిగా కనిపిస్తాడని.. ఈ క్రమంలో దుష్టశక్తులను అడ్డుకునే పనిలో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఇది గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమాలో బాలయ్య శివుడి భక్తునిగా చేసిన ఊచకోత ఎలా ఉందో మనం చూశాం.

Salaar: ‘సలార్’లో ప్రశాంత్ నీల్ నింపేస్తున్నాడట!

ఇప్పుడు అలాంటి పాత్రలోనే ప్రభాస్ కూడా కనిపిస్తుండటంతో ఈ సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్స్ అదే రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తతో సలార్ చిత్రంలో ప్రభాస్ దుండగులను ఏ విధంగా కుమ్మేయనున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.