Satyadev: మెగాస్టార్‌పై సత్యదేవ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. గాడ్‌ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విలక్షణ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు చిరు.

Satyadev: మెగాస్టార్‌పై సత్యదేవ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!

Satyadev Comments On Chiranjeevi Goes Viral

Satyadev: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా.. ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టింది.

Chiranjeevi : సత్యదేవ్‌కి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’లో రోల్ లీక్..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ శ్రీముఖితో చిరు ఆకాశవీధుల్లో చేసిన సందడి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గాడ్‌ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విలక్షణ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు చిరు. ఈ సినిమాలోని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సత్యదేవ్ అయితే పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతాడని చిరు స్వయంగా రికమెండ్ చేసినట్లుగా తెలిపారు. అయితే చిరు తనపై చూపిన విశ్వాసానికి తానెప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని సత్యదేవ్ ఈ సందర్భంగా తెలిపాడు.

Godfather: ‘గాడ్‌ఫాదర్’లో ఆ పాత్రను లేపేశారా..?

ఇక సెట్స్‌లో చిరంజీవి ఎలా ఉంటారో సత్యదేవ్ ఈ సందర్భంగా తెలిపాడు. సెట్స్‌లో చిరు చాలా డిసిప్లిన్‌గా ఉంటారని, ఆయనలోని ఎనర్జీ చూసి సెట్స్‌లో ఉన్నవారంతా షాక్ అయ్యే వారని.. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారని సత్యదేవ్ తెలిపాడు. ఇక ఈ యాక్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావడం ఖాయమని చిరు ధీమా వ్యక్తం చేశారు.