Satyadev: ‘గాడ్‌ఫాదర్’ దెబ్బకు సత్యదేవ్ కూడా డబుల్ చేశాడుగా!

తెలుగు నటుల్లో తనకంటూ విలక్షణమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యాక్టర్ సత్యదేవ్. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’లో కీలక పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. అటు బాలీవుడ్‌లోనూ సత్యదేవ్‌కు క్రేజ్ వచ్చి చేరింది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో సత్యదేవ్ నటించాడు. ప్రస్తుతం సత్యదేవ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయనకు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజీ ఆఫర్స్ వస్తుండటంతో ఆయన తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Satyadev: ‘గాడ్‌ఫాదర్’ దెబ్బకు సత్యదేవ్ కూడా డబుల్ చేశాడుగా!

Satyadev Doubles His Remuneration

Satyadev: తెలుగు నటుల్లో తనకంటూ విలక్షణమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యాక్టర్ సత్యదేవ్. పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్, ఆ తరువాత తనదైన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. బ్లఫ్‌మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు తదితర సినిమాల్లో హీరోగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సత్యదేవ్.

Satyadev: మెగాస్టార్‌పై సత్యదేవ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!

ఇక రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’లో కీలక పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. ఈ సినిమాలో చిరుతో పాటు సత్యదేవ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అటు బాలీవుడ్‌లోనూ సత్యదేవ్‌కు క్రేజ్ వచ్చి చేరింది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో సత్యదేవ్ నటించాడు. ఆయన నటనకు నార్త్ ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. దీంతో సత్యదేవ్‌కు అన్ని భాషల్లో డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సత్యదేవ్ రెడీ అయ్యాడు.

Satyadev : ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..

ప్రస్తుతం సత్యదేవ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయనకు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజీ ఆఫర్స్ వస్తుండటంతో ఆయన తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకాలం తన కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుందని, మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తానని ఈ సందర్భంగా సత్యదేవ్ అంటున్నాడు.