సత్యమేవ జయతే 2 – ఫస్ట్ లుక్

జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 1, 2019 / 06:46 AM IST
సత్యమేవ జయతే 2 – ఫస్ట్ లుక్

జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..

జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ మూవీకి సీక్వెల్‌గా.. ‘సత్యమేవ జయతే 2’ రూపొందనుంది.  జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో.. టీ-సిరీస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై.. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మోనీషా అద్వాణీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వాణీ నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ‘సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘తన్, మన్, ధన్ సే బఢ్కర్.. జన్, గణ్, మన్’ అనే కొటేషన్‌తో జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్‌ల లుక్స్ విడుదల చేశారు. లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Red Also : ట్రైలర్ – చైన్నై చెక్కేసి రామరాజ్ బనియన్‌లు అమ్ముకోమ్మా! 

సత్యమేవ జయతే చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 2018 ఆగస్టు 15న విడుదల చేస్తే, సత్యమేవ జయతే 2 గాంధీ జయంతి సందర్భంగా 2020 అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.