దీపావళి ముందు పతంగులేందిరా – ఆసక్తికరంగా ‘సవారి’ ట్రైలర్

నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ‘సవారి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : January 23, 2020 / 05:15 AM IST
దీపావళి ముందు పతంగులేందిరా – ఆసక్తికరంగా ‘సవారి’ ట్రైలర్

నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ‘సవారి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న యానిమల్ బేస్డ్ మూవీ, ‘సవారి’.. బందంరిగాడ్ అనే ఇండిపెండెంట్ ఫిలింతో ఆకట్టుకున్న సాహిత్ మోత్కూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషాంక్ అండ్ సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై సాహిత్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా ‘సవారి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నందు.. రాజు అనే పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. బాద్‌షా గా అతని గుర్రం కనిపిస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఫన్నీగా ఉంది.. రాజుకీ బాద్‌షా కి మధ్య ఉన్న ఎమోషన్‌ని కూడా చూపించారు.

Read Also : వందేళ్లొచ్చినా సరే తెలుగులో మాత్రమే నటిస్తాను

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఫిబ్రవరి 7న ‘సవారి’ విడుదల కానుంది. సంగీతం : శేఖర్ చంద్ర, కెమెరా : మోనిష్ భూపతిరాజు, ఎడిటింగ్ : సంతోష్ మీనన్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, పూర్ణా చారి, శేఖర్ చంద్ర, రామాంజనేయులు, శ్రీరామ్.