Eeswar : పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత.. సినీ ప్రముఖులు సంతాపం..

సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు..

10TV Telugu News

Eeswar: సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు కొసనా ఈశ్వర రావు. వయసు 84 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం.

Kewal : ‘ఢీ’ కంటెస్టంట్ కేవల్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన యశ్ మాస్టర్..

బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పలు సినిమాలకు పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు.

Actress Nandita Swetha : హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్ తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను కూడా ఆయన డిజైన్ చేశారు. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం.

Cinema Poster

 

ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది.

Eeswar

 

ఆయనకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు, తెలుగు సినీ పబ్లిసిటీ డిజైనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

Eswar