L Vijayalakshmi : పుష్ప హీరో ఎవరో తెలీదు.. సీనియర్ హీరోయిన్ వ్యాఖ్యలు..

ప్రోగ్రాంలో విజయలక్ష్మి అప్పటి పలు విశేషాలని పంచుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి పుష్ప సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లోనే.............

L Vijayalakshmi : పుష్ప హీరో ఎవరో తెలీదు.. సీనియర్ హీరోయిన్ వ్యాఖ్యలు..

Seniour actress L Vijayalakshmi comments on pushpa and alluarjun

L Vijayalakshmi :  1950,60 దశకాలలో అప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించి, నర్తించి మెప్పించింది ఒకప్పటి హీరోయిన్ L విజయలక్ష్మి. చాలా అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో తను చేసిన సినిమాల్లో కచ్చితంగా తన డ్యాన్స్ ఉండేలా చూసేవారు అప్పటి దర్శక నిర్మాతలు. 1969లో విజయలక్ష్మి ఓ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ని పెళ్లి చేసుకొని సినిమాలు వదిలేసి విదేశాలకి వెళ్ళిపోయింది.

50 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశానికి ఇటీవలే వచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి వారోత్సవాల సందర్భంగా ఆమెకి ఎన్టీఆర్ జాతీయ అవార్డుని ప్రకటించడంతో అవార్డు అందుకోవడానికి అమెరికా నుంచి వచ్చారు L విజయలక్ష్మి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఇక్కడే ఉండనుండటంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అలీతో సరదా ప్రోగ్రాంకి విజయలక్ష్మి వచ్చారు.

Arjun Kapoor : మహిళా జర్నలిస్ట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ హీరో.. మరీ ఇంత దిగజారి వార్తలు రాస్తారా??

ఈ ప్రోగ్రాంలో విజయలక్ష్మి అప్పటి పలు విశేషాలని పంచుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి పుష్ప సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లోనే 50 ఏళ్లుగా ఉండిపోయారు, తెలుగు సినిమాలు ఇటీవల ఏమైనా చూశారా అని అలీ అడగగా పుష్ప చూశాను అని చెప్పింది. అందులో హీరో ఎవరో తెలుసా అని అలీ అడగగా తెలియదు అని చెప్పింది. దీంతో అలీ.. ఆ హీరో అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పాడు. ఆమె అవునా అంటూ ఆశ్చర్యపోయి.. ఇటీవల ఏ హీరో గురించి అడిగినా ఇలాగే చెప్తున్నారు నాగేశ్వరరావు గారి మనవడు, రామానాయుడు గారి మనవడు అంటున్నారు అని అంది.