Producer Ravindran arrested : చీటింగ్ కేసులో అరెస్టైన ప్రముఖ నిర్మాత

సీరియల్ నటి మహాలక్ష్మీ భర్త, నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్‌ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. రూ.16 కోట్ల మేర మోసం చేసారని బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Producer Ravindran arrested : చీటింగ్ కేసులో అరెస్టైన ప్రముఖ నిర్మాత

Producer Ravindran arrested

Updated On : September 8, 2023 / 2:30 PM IST

Producer Ravindran arrested : సీరియల్ నటి మహాలక్ష్మి భర్త, సినీ నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ చీటింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనం రేపింది. ఓ వ్యక్తిని రూ.16 కోట్ల మేర మోసం చేసారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Silvina Luna : ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో మరణించిన ప్రముఖ నటి..

సీరియల్ నటి మహాలక్ష్మి , సినీ నిర్మాత రవీంద్రన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది వీరిద్దరి పెళ్లిపై పెద్ద చర్చ జరిగింది. తాజాగా రవీంద్రన్ ఓ చీటింగ్ కేసులో ఇరుక్కోవడం, అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రాజెక్టు విషయంలో రవీంద్రన్ రూ.16 కోట్లు మోసం చేసారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి  రవీంద్రన్ తన నుండి రూ.16 కోట్ల తీసుకుని  మోసం చేసారని ఆరోపిస్తూ కొద్దిరోజుల క్రితం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలంలో ఫిర్యాదు చేసారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌ను ఇంధనంగా మార్చే రూ.200 కోట్ల విలులైన ప్రాజెక్టులో పెట్టుబడి కోసం రవీంద్రన్ తనను సంప్రదించారని తాను పెట్టుబడిగా రూ.16 కోట్లు ఇచ్చానని ఆయన చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో తన డబ్బు ఇవ్వాల్సిందిగా కోరితే రవీంద్రన్ తిరిగి చెల్లించేందుకు నిరాకరించడమే కాకుండా తనను బెదిరించాడని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Shah Rukh Khan : గుండుతో మళ్లీ నటించనన్న షారూఖ్ కామెంట్స్ వైరల్

పోలీసుల దర్యాప్తులో రవీంద్రన్ ప్రాజెక్టు పేరుతో బాలాజీని నమ్మించి నకిలీ పత్రాలు తయారు చేసి మోసం చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్మాత రవీంద్రన్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతేడాది రవీంద్రన్ సీరియల్ నటి మహాలక్ష్మిని పెళ్లాడారు. సోషల్ మీడియాలో తరచూ ఈ జంట పోస్టులు పెడుతూ అందరితో టచ్‌లో ఉంటారు.