Sherlyn Chopra Vs Rakhi Sawant : ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదుగా..

షెర్లిన్ చోప్రా నటుడు సాజిద్ ఖాన్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సపోర్ట్ చేయడంతో ఆమెపై కూడా తాజాగా ముంబైలోని అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు................

Sherlyn Chopra Vs Rakhi Sawant : ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Sherlyn Chopra Vs Rakhi Sawant issue goes viral in Bollywood

Sherlyn Chopra Vs Rakhi Sawant : ఇటీవల బాలీవుడ్ నటుడు సాజిద్ ఖాన్ ని హిందీ బిగ్‌‍బాస్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సాజిద్ ఖాన్ పలువురిని లైగికంగా వేధించాడని అతనిపై చాలా మంది నటీమణులు మీటూ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రోజూ దీనిపై మాట్లాడుతుంది. సాజిద్ ఖాన్ ని తీవ్రంగా విమర్శిస్తుంది. తనని కూడా లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది షెర్లిన్ చోప్రా.

అయితే ఈ విషయంలో మరో బాలీవుడ్ భామ రాఖీ సావంత్ సాజిద్ ఖాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. దీంతో షెర్లిన్ చోప్రా, రాఖి సావంత్ మధ్య గొడవ మొదలైంది. ఈ వివాదం రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఒకరిపై ఒకరు మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఇది ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేసేవరకు వెళ్ళిపోయింది.

BiggBoss 6 Day 64 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరో తెలుసా?? అందరూ కలిసి ఇనయాని టార్గెట్ చేశారుగా..

షెర్లిన్ చోప్రా నటుడు సాజిద్ ఖాన్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సపోర్ట్ చేయడంతో ఆమెపై కూడా తాజాగా ముంబైలోని అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ మరోసారి అలాంటివాడికి సపోర్ట్ చేస్తావా అంటూ రాఖీ సావంత్ పై ఫైర్ అయింది. అటు రాఖీ సావంత్ కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని షెర్లిన్ చోప్రాపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.