Aadikeshava : సిత్తరాల సిత్రావతి వచ్చేసింది.. ఆదికేశవ కోసం శ్రీలీల మాస్ స్టెప్పులు

సిత్తరాల సిత్రావతి' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి తాజాగా ఈ లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటకు GV ప్రకాష్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు.

Aadikeshava : సిత్తరాల సిత్రావతి వచ్చేసింది.. ఆదికేశవ కోసం శ్రీలీల మాస్ స్టెప్పులు

Sittharala Sithravathi Lyrical Song released from Sreeleela Vaishnav tej Aadikeshava Movie

Aadikeshava Movie Song : మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) నటిస్తున్న నాలుగో సినిమా ‘ఆదికేశవ’. మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడిగా ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు.

Mark Antony : విశాల్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. మార్క్ అంటోని సినిమా రిలీజ్‌పై స్టే.. 15 కోట్లు కడితేనే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి గతంలో ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. ఇటీవల ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి తాజాగా ఈ లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటకు GV ప్రకాష్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు. సాంగ్ లో వైష్ణవ్ అండ్ శ్రీలీల వేసిన గ్రేస్ స్టెప్పులు అదిరిపోయాయి. శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. లిరికల్ లో కొద్దిసేపు చూపిస్తేనే ఈ రేంజ్ లో ఉంది అంటే థియేటర్ లో శ్రీలీల స్టెప్పులకు దద్దరిల్లాల్సిందే. ఇక ఆదికేశవ సినిమా నవంబర్ 10న రిలీజ్ కానుంది.