Venky – Rana : బాబాయ్ – అబ్బాయ్‌.. మధ్యలో నిషా..

విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు..

Venky – Rana : బాబాయ్ – అబ్బాయ్‌.. మధ్యలో నిషా..

Venky - Rana Web Series

Venky – Rana: విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇంతకుముందు రానా హీరోగా యాక్ట్ చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ‘బళ్లారి బావ’ అనే స్పెషల్ సాంగ్‌లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చారు వెంకీ.

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..

ఇప్పుడు బాబాయ్ – అబ్బాయ్ నటించబోయేది సినిమాలో కాదు.. వెబ్ సిరీస్ కోసం ఈ దగ్గుబాటి హీరోలు కలిసి వర్క్ చెయ్యబోతున్నారు. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌ను కాంటాక్ట్ అయ్యారట టీమ్.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

నిషా.. ‘ఏమైంది ఈ వేళ’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ సినిమాలు చేసింది. తర్వాత పెళ్లి చేసుకుని పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయించింది. 2018లో కొడుకు ఇషాన్‌కు జన్మనిచ్చింది నిషా. గతకొద్ది కాలంగా మంచి క్యారెక్టర్ పడితే రీ ఎంట్రీ ఇవ్వాలని వెయిట్ చేస్తున్న నిషాకు.. వెంకీ – రానా చేస్తున్న వెబ్ సిరీస్ కాన్సెప్ట్, తన రోల్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)