శ్రీముఖి చెప్పింది.. ఫ్యాన్స్ చెలరేగిపోయారు.. చివరికి..

శ్రీముఖి చెప్పింది.. ఫ్యాన్స్ చెలరేగిపోయారు.. చివరికి..

Sreemukhi: బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. ఇటీవల గోవా ట్రిప్ వేసిన అమ్మడు కిరాక్ ఫొటోలు షేర్ చేసి పిచ్చక్కించింది. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ మెరిసిన ఈ ముద్దుగుమ్మకి ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

తరచూ ఇన్‌స్టా లైవ్‌లో ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది శ్రీముఖి.. ఎప్పటిలానే రీసెంట్‌గా లైవ్‌లో అభిమానులతో మాట్లాడింది. ఈసారి వారికి మీరు ఏ ఫొటో అడిగినా పంపుతా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసలే హాట్ యాంకర్.. పైగా ఆఫర్ ఇచ్చింది ఇక ఆకతాయిలు ఆగుతారేంటి.. చెలరేగి పోయారు.

అప్పుడు పూజా హెగ్డే.. ఇప్పుడు శ్రీముఖి..

శ్రీముఖి అడిగిన వారికి పిక్స్ పంపుతుండగా ఓ నెటిజన్ న్యూడ్ ఫొటో పంపమని అడిగాడు.. వెంటనే టిట్ ఫర్ టాట్ తరహాలో స్పందించిన శ్రీముఖి, రామ్ గోపాల్ వర్మ ‘నేకెడ్’ సినిమా పోస్టర్ పంపింది. దాంతో అతగాడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చావ్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ శ్రీముఖికి సపోర్ట్‌గా కామెంట్స్ చేశారు..
మొన్నీమధ్య హాట్ బ్యూటీ పూజా హెగ్డేను కూడా ఓ నెటిజన్ నగ్నంగా ఉన్న పిక్ అడిగాడు. కాగా పూజా తన కాళ్ల ఫొటో పంపి ఇదే నువ్వడిగిన న్యూడ్ పిక్ అని కౌంటర్ ఇచ్చింది.

Sreemukhi