SSMB28: ఫస్ట్ లుక్‌లోనే కాదు.. సినిమా మొత్తం ఊచకోతే అంటోన్న మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

SSMB28: ఫస్ట్ లుక్‌లోనే కాదు.. సినిమా మొత్తం ఊచకోతే అంటోన్న మహేష్..?

SSMB28 Movie To Have Mahesh Babu Mass Avatar Throughout

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో రివీల్ చేశారు.

SSMB28 : షూటింగ్ సెట్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్.. వైరల్!

ఈ పోస్టర్‌లో ఊరమాస్ స్వాగ్‌తో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మాస్ అవతారాన్ని చేస్తూ కనిపించాడు. ఇక ఈ పోస్టర్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లోనిది అనేది అర్థమవుతోంది. అయితే, మహేష్ ఈ మాస్ లుక్‌లో కేవలం ఈ ఫైట్ వరకే కనిపిస్తాడా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

అయితే, మహేష్ ఈ ఊరమాస్ అవతారం కేవలం ఫైట్ కోసమో, ఫస్ట్ లుక్ కోసమో కాదని.. సినిమా మొత్తం ఇదే తరహా లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాడట మహేష్. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.