Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..
సినిమా తియ్యడం ఒక ఎత్తైతే దాన్ని మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తు. సీజన్ చూస్కోవాలి, ఏ స్టార్ హీరో సినిమా క్లాష్ లేకుండా చూస్కోవాలి. అందుకే సినిమా అవ్వకుండానే రిలీజ్ డేట్స్............

Star Heros : సినిమా తియ్యడం ఒక ఎత్తైతే దాన్ని మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తు. సీజన్ చూస్కోవాలి, ఏ స్టార్ హీరో సినిమా క్లాష్ లేకుండా చూస్కోవాలి. అందుకే సినిమా అవ్వకుండానే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అదీకాక ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి సమ్మర్ వరకూ జరిగిన రిలీజ్ డేట్స్ పంచాయితీలు దృష్టిలో పెట్టుకుని ముందే సీజన్ల మీద ఖర్చీఫ్ వేసుకుంటున్నారు హీరోలు.
హీరోలు జాగ్రత్త పడుతున్నారు. ఎంత కష్టపడి సినిమా చేసినా కరెక్ట్ టైమ్ కి రిలీజ్ చెయ్యకపోతే పడ్డ కష్టమంతా వేస్టే. అందుకే ఈమధ్య రిలీజ్ డేట్స్ విషయంలో కాస్త ముందుచూపుతోనే ఉంటున్నారు ప్రొడ్యూసర్లు కూడా. అదీకాక కోవిడ్ తో పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ కి రెడీ అవడంతో ఈ సంవత్సరం రిలీజ్ క్లాష్ లతో పాటు రిలీజ్ డేట్స్ మార్చుకోవడానికి టాలీవుడ్ లో పంచాయితీలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే ఈ సారి ముందే ఖర్చీఫ్ వేసుకుంటున్నారు హీరోలు.
మెగాస్టార్ అయితే ఈ లిస్ట్ లో ముందే ఉన్నారు. చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ని అయితే వినాయక చవితికే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు అయితే ఇంకాస్త స్పీడ్ పెంచేశారు. అఖండ హిట్ వైబ్స్ కంటిన్యూ అవుతుండగానే అప్పుడే గోపీచంద్ మలినేనితో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాని దసరాకే రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్. ఇక అనిల్ రావిపూడితో ఆగస్ట్ లో స్టార్ట్ చెయ్యబోతున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపాల్సిందే అని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు బాలయ్య.
Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..
సంక్రాంతి కి సూపర్ హిట్ ట్రాక్ ఉన్న మహేష్ బాబు అయితే వచ్చే సంక్రాంతికి కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో నెక్ట్స్ మంత్ స్టార్ట్ చేస్తున్న సినిమాని సంక్రాంతికి ఫినిష్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ చేసుకున్న ఈ టీమ్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతోంది. 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసుకున్నారు మహేష్ అండ్ కో.
అక్కినేని హీరోలు నాగార్జున, అఖిల్ కూడా తమ సినిమాలకు సీజన్ సెట్ చేసుకుంటున్నారు. నాగార్జున ఘోస్ట్ మూవీ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తుంటే, అఖిల్ కూడా తన సినిమాని విజయదశమికే తీసుకొద్దామనుకుంటున్నారు. ఇప్పటికే ఆగస్ట్ లో రిలీజ్ అనౌన్స్ చేసిన అఖిల్ ఏజెంట్ మూవీ ఇప్పుడు షూటింగ్ డిలేతో దసరాకి పోస్ట్ పోన్ అవుతోందని టాక్ నడుస్తోంది.
- Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
- NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..
- Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?
- Small Movies : ఆసక్తి పెంచుతున్న చిన్న సినిమాలు..
- Tollywood : సెకండాఫ్ సంగతేంటి?? అప్పుడే సగం ఫిక్స్..
1Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
2Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య
3టీడీపీపై హౌస్ కమిటీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
4రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
5కాళేశ్వరంలో చేపల వర్షం
6Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
7Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ
8Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్
9Amarnath : అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించింది ముస్లిం వ్యక్తే : ఫరూక్ అబ్దుల్లా
10Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?