AP Government : ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్.. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం.. రెడీగా ఉండండి..
AP Government : ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలు, మహిళల ఆర్థిక అభివృద్ధికోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో
AP Government
AP Government : ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలు, మహిళల ఆర్థిక అభివృద్ధికోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే, తాజాగా.. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : AP Govt : ఏపీలో వారందరికీ శుభవార్త.. రూ.33వేలు ఇక కట్టాల్సిన పనిలేదు.. ప్రభుత్వం ఆదేశాలు జారీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలను ప్రభుత్వ రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఏకీకృత కుటుంబ సర్వే -UFS ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
గ్రామాలు, పట్టణాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్ధితిని తెలుసుకుని రికార్డులను సిబ్బంది నవీకరించనున్నారు. అర్హత కలిగిన కుటుంబం, వ్యక్తి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడమే లక్ష్యంగా ఈ సర్వేను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిజమైన అర్హులను ప్రభుత్వం గుర్తించనుంది.
ప్రభుత్వ సమాచారం కచ్చితత్వం, పరిపూర్ణతను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించనుంది. కుటుంబ వివరాలను నేరుగా ఇంటి వద్దకు వెళ్లి సిబ్బంది పొందుపర్చనున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా డేటా రూపొందించడం సహా పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ సిబ్బంది సర్వేను చేపట్టనున్నారు. తద్వారా సమాచారం ఖచ్చితంగా నమోదు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా సాగేందుకు సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలను అందించేందుకు ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
