India War: యుద్ధానికి సిద్ధం..! బంగ్లాదేశ్‌కు మూడిందా? భారత్ వార్నింగ్ ఇచ్చింది బంగ్లాకేనా?

భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్థాన్..భారత్‌పై విద్వేషంతో కొత్త బిచ్చగాడిలా మారిన బంగ్లాదేశ్ రెండూ కలిస్తే ఏమవుతుంది.

India War: యుద్ధానికి సిద్ధం..! బంగ్లాదేశ్‌కు మూడిందా? భారత్ వార్నింగ్ ఇచ్చింది బంగ్లాకేనా?

Updated On : December 23, 2025 / 9:33 PM IST

India War: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందా? బంగ్లాలో హిందూ వ్యతిరేక ధోరణి బలపడిన వేళ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. మన దేశంలోని నిరసనలపై వివరణ ఇవ్వాలని భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపగా.. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. షార్ట్ టర్మ్ యుద్ధాలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపు ఇవ్వడం సంచలనంగా మారింది.

వివరణ ఇవ్వాలంటూ భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపడంతో ఇరు దేశాల మధ్య నిరసనలు కాస్తా దౌత్య వివాదం దాకా వెళ్లినట్లయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ లోని పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఢిల్లీకి కూడా విస్తరించడంతో ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి

భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్థాన్..భారత్‌పై విద్వేషంతో కొత్త బిచ్చగాడిలా మారిన బంగ్లాదేశ్ రెండూ కలిస్తే ఏమవుతుంది..ఏమవుతుందో అనేది కాసేపు పక్కనబెడితే..మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఓ ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. సైనికులు ఎలాంటి యుద్ధాలకైనా సిద్ధం కావాలని..మనకి ఉన్న టెక్నాలజీతో..షార్ట్ టర్మ్ వార్స్ తప్పవని సంకేతాలు ఇచ్చారు. ఇదేం ఆషామాషీగా అల్లాటప్పగా చెప్పిన మాటేం కాదు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత్‌లో రక్తం మరిగేలా చేస్తున్నాయ్. అందుకే వీధుల్లో..దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున జనం బంగ్లాపై విరుచుకుపడ్డారు..ఇది గమనించే సరబానంద కూడా బంగ్లాకి మందులు పని చేయనప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించారు

ఈ మాటలు బంగ్లాదేశ్‌కి అర్ధమైనా కాకపోయినా..జరిగేది ఆగదు.. ఐతే ఈలోపే ఆపరేషన్ సింధూర్ సమయంలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్..మధ్యలో ఎంట్రీ ఇస్తోంది..బంగ్లాదేశ్‌పై దాడి జరిగితే..ఆ దేశానికి మద్దతిస్తామంటూ ప్రకటించింది. బంగ్లాదేశ్‌ వెనుక తాముంటామంటూ ప్రగల్భాలు పలికింది..ఇలా ఒకరి వెనుక ఒకరు ఉండాల్సిందే కానీ..యుద్ధక్షేత్రంలో భారత సైన్యం ముందుకు వస్తే..పిక్కబలం చూపడంలో ఈ రెండు దేశాల్లో ఏది ముందు ఏది వెనుక అనేది తేల్చుకోవాలి.

గత వారంలో కూడా అనిల్ చౌహాన్..యుద్ధం గెలవాలంటే మాటలు కాదు..చేతలు అని చెప్పారు. బహుశా మరి అది పాక్‌ని దృష్టిలో పెట్టుకునే అయి ఉండాలి.. ఈ మధ్య ఆయన తరచూ త్రివిధ దళాల సమన్వయం గురించి ప్రస్తావిస్తున్నారు..అలానే ఆరు దేశాలతో మనకి యుద్ధం తరహా ఘర్షణ వాతావరణం ఉందని..వాటన్నింటికీ రెడీగా ఉండాలని..టెక్నాలజీ అప్ గ్రేడ్ చేసుకోవాలని సైన్యానికి సీడీఎస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షార్ట్ టర్మ్ వార్ ప్రస్తావన చేశారు.

ఓ వేళ బంగ్లాదేశ్‌పై యుద్ధమే చేస్తే..అది ఎలా ఉంటుంది..కేవలం వైమానిక దాడుల ప్రస్తావన రాకపోవచ్చు..ఎందుకంటే..ఆ దేశం మనతో కయ్యానికి దిగలేదు..దిగాలనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు..మరి ఎలా చేయాలి యుద్ధం? అదే దౌత్యపరంగా..ఆర్ధికపరంగా అష్టదిగ్బంధం చేస్తే..బంగ్లాదేశ్ పాలకుల దరిద్రం ఏంటో వారికే తెలిసి వస్తుంది. అందుకే ఈ కోణంలోనే కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయ్.

Also Read: బంగ్లాదేశ్‌లో పెచ్చరిల్లుతున్న హిందూద్వేషం.. అసలక్కడ ఏం జరుగుతోంది? మరో పాకిస్థాన్‌లా మారుతోందా?