Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో పెచ్చరిల్లుతున్న హిందూద్వేషం.. అసలక్కడ ఏం జరుగుతోంది? మరో పాకిస్థాన్‌లా మారుతోందా?
అలా బంగ్లాదేశ్ ఓ దేశంగా మారగా..దాంట్లో భారత సైనికుల ప్రాణత్యాగం కూడా ఉంది. ఇప్పుడు చూస్తే మనపైనే విషం కక్కుతోంది.
Bangladesh Unrest: బంగ్లాదేశ్ లో హిందూ ద్వేషంపై భారత్ భగ్గుమంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనం రోడ్డెక్కారు. పొరుగు దేశంలో ద్వేషంపై మండిపడ్డారు. బంగ్లాలో హిందువులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అసలు బంగ్లా పుట్టుకే భారత్ పెట్టిన భిక్ష అయితే.. ఇప్పుడు ఎందుకిలా యాంటీ ఇండియా స్టాండ్ కు మద్దతిస్తున్నారు? ఎందుకింత ద్వేషం?
బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు..ఉస్మాన్ హాదీ మర్డర్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏ సంబంధమూ లేని భారత్‌పై ద్వేషం పెచ్చరిల్లుతోంది.. మధ్యలో అక్కడున్న హిందువులపై దాడులు..సజీవంగా చంపేస్తోన్న సంఘటనలు బంగ్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. దీన్నే నిరసిస్తూ..దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భారతీయులు ఆందోళనకు దిగారు. విశ్వహిందూ పరిషత్ సహా అనేక సంఘాలు వీటిని లీడ్ చేశాయ్.
జమ్ము కశ్మీర్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంగ్లాలో పరిస్థితికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై దాడులను బంగ్లా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందంటూ ఆరోపించారు. భోపాల్, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు యూనస్ ఖాన్
దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చెప్పులతో కొట్టడం వంటి సంఘనటలు చోటు చేసుకున్నాయ్.
వారణాసి..యూపీలోనూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లా వ్యతిరేక ర్యాలీలు ప్రదర్శనలు చోటు చేసుకున్నాయ్. ఢిల్లీలో రోజంతా ఇదే ఆందోళనలు కొనసాగాయ్. హిందువులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంటే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లా విమోచన పేరుతో పాక్ పై భారత్ యుద్ధం..
అసలు బంగ్లాదేశ్ గత యాభై ఏళ్లలో చాలా మారిపోయిందని చెప్పాలి. 1970 నాటి డిసెంబర్ కి ఇప్పటి డిసెంబర్ కి ఎంత తేడానో అన్పించకమానదు. 1970 డిసెంబర్‌లో ఈస్ట్ పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికలలో అవామీ లీగ్ 162కి-160 సీట్లు గెలిచింది. ఐతే పాక్ పాలకుడు యాహ్యాఖాన్ నేతృత్వంలో దాన్ని అస్సలు గుర్తించకుండా..30 లక్షల మంది బంగ్లా వాసులను ఊచకోత కోసేలా పాక్ సైన్యాన్ని నడిపించాడు. అప్పటి అనివార్యతలతో.. భారత సైన్యం పాక్‌పై బంగ్లా విమోచన పేరుతో యుద్ధం చేసింది.
1971 డిసెంబర్ 16 నాటికి పాక్ సైనికులు 90వేల మందిని ఖైదీలుగా చేసింది. అలా బంగ్లాదేశ్ ఓ దేశంగా మారగా..దాంట్లో భారత సైనికుల ప్రాణత్యాగం కూడా ఉంది. ఇప్పుడు చూస్తే మనపైనే విషం కక్కుతోంది. ద్వేషంతో రగులుతోంది.. అలా యాంటీ ఇండియా పాట అందుకున్న వారిని ఇక్కడ హీరోలుగా చూస్తున్నారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోవడానికి.. హసీనా దేశం విడిచి పారిపోవడానికి.. అక్కడి ఆందోళనలు కారణం.
అందులో ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ అనే యువకుడు ప్రధాన పాత్ర అని చెప్తుండగా.. అతను ఈ డిసెంబర్ లో హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్ హస్తముందంటూ ఆరోపణలు రావడమే కాదు.. మన రాయబారికి బంగ్లా సమన్లు పంపింది. భారత్ వీసాలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే
దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు.. మతపరమైన ఘర్షణకి కారణమయ్యాడంటూ సజీవదహనం చేశారు.
వాస్తవానికి అక్కడ దీపు చంద్రదాస్ అలాంటి పనీ ఏదీ చేయలేదని అతను పని చేసే ఫ్యాక్టరీ తర్వాత తేల్చింది. మరోవైపు మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా బంగ్లాదేశ్ కదలికలు భారత్‌కి వ్యతిరేకంగా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇచ్చింది. వీటికి కారణం..సింపుల్ ఇస్లామిక రాడికలిజం పాకిస్థాన్, చైనాకి వ్యూహాత్మకంగా దగ్గర కావడం.
ఉగ్రవాద దేశం ఛాయలోకి బంగ్లాదేశ్..?
బంగ్లాదేశ్ చేస్తున్న తప్పిదం ఏంటంటే.. తమ దేశస్థులను సొంత వారే చంపుతుంటే అది తమ ఎన్నికలలో లాభం కోసం చూస్తూండిపోవడం..ఇది ఇలానే జరిగితే..తొందరలోనే అదో పాకిస్థాన్‌లా.. అప్పులకుప్పగా మారడంతో పాటు ఉగ్రవాద దేశం ఛాయలోకి వెళ్తుంది. తాత్కాలికంగా తమ దరిద్రానికి భారత్ కారణమనే మతపరమైన కుట్రలను.. సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభం దక్కించుకోవచ్చు.. కానీ దేశ ఆర్ధిక పరిస్థితి.. ప్రజల జీవనస్థితులకు దీర్ఘకాలంలో మాత్రం పెద్ద దెబ్బే అని ఇక్కడి పార్టీలు గుర్తుంచుకోవాలి.
Also Read: అదే జరిగితే.. భారత్‌తో యుద్ధమే..! రెచ్చిపోయిన పాకిస్తాన్ నాయకుడు..
