ఒక పర్టికులర్ క్యారెక్టర్‌లో ట్రాప్ చేసి పెట్టారు.. నేనేమీ లిమిట్‌ పెట్టుకోలేదు..: సినీనటి ప్రగతి

"అటువంటి పాత్రలో నన్ను నేను చూడాలనుకుంటున్నా" అని ప్రగతి తెలిపారు.

ఒక పర్టికులర్ క్యారెక్టర్‌లో ట్రాప్ చేసి పెట్టారు.. నేనేమీ లిమిట్‌ పెట్టుకోలేదు..: సినీనటి ప్రగతి

Actress Pragathi

Updated On : December 23, 2025 / 5:01 PM IST

Actress Pragathi: సినిమాల్లో ఏదో ఒక రకమైన పాత్రలో నటించడానికి తాను పరిమితం కాలేదని, అన్ని రకాల పాత్రలు చేయగలనని సినీనటి ప్రగతి అన్నారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రగతి మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు.

“నా ఛాయిసెస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు మార్చుకున్నాను. నాకు జిమ్‌లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సినిమా షూటింగ్‌ సెట్‌లో నుంచి ఒక పర్ఫామ్ చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఒక కేటగరైజ్ చేసి నన్ను ఒక పర్టికులర్ క్యారెక్టర్‌లో ట్రాప్ చేసి పెట్టారు. ఇంకా ఎన్నో చేయాలి. అందుకని కొన్ని మానుకోవాల్సి వస్తుంది.

Also Read: ఒరేయ్ దమ్ముంటే నాతో ఫేస్‌ టు ఫేస్‌ రండ్రా: సినీనటి ప్రగతి

ఇప్పుడు చేసేది ఏ క్యారెక్టర్ అయినా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఏజ్ అనే ప్రాబ్లం లేదు. నేను ఏ పాత్రనైనా చేయగలను. ఇప్పుటిదాకా వాళ్లు ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు.. ఇంక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటున్నానో అలాగే చూస్తారు.

అమ్మ పాత్ర నెగిటివ్ పాత్ర అవ్వచ్చు.. అమ్మ పాత్ర పాజిటివ్ అవ్వచ్చు.. అమ్మ గయ్యాలిగా ఉండొచ్చు. ఇందులో చాలా వెరైటీల అమ్మ పాత్రలు చేయగలను. ఏ క్యారెక్టర్ అయినా నేను చేయడానికి రెడీ. కాకపోతే ఏదో ఒక పర్టికులర్ స్లాట్ కాకుండా అన్నీ చేయడానికి రెడీ. ఇప్పటివరకు నేను చేయని పాత్రలో, ఒక కొత్త కోణంలో నన్ను నేను చూడాలనుకుంటున్నా” అని ప్రగతి తెలిపారు.

Also Read:

తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి