Bigg Boss 7 : శుభ శ్రీ ఎలిమినేట్.. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా మొదటి సారి..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఐదో వారం పూర్తి కావొచ్చింది. ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని చెప్పినట్లుగానే ఉంది.

Subhashree Eliminated
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఐదో వారం పూర్తి కావొచ్చింది. ఈ సీజన్ ఉల్టా పుల్టాగా అని ఉంటుందని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే ఉంది. ప్రతీ ఆదివారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి ఎపిసోడ్ ఆఖరుకు ఎవరు ఎలిమినేట్ కానున్నారో చెబుతారు. అయితే.. ఈ ఆదివారం మాత్రం డైరెక్ట్‌గా ఎలిమినేట్ ఎవరు అయ్యారు అనే విషయాన్ని చెప్పేశారు. నామినేషన్స్ లో ఉన్న అందరిని యాక్టివిటీ రూమ్‌కు పిలిపించి శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున ఎనౌన్స్ చేశారు.
Susank Bharadwaj : అనసూయ భర్త గురించి మీకు తెలియని విషయాలు.. బైక్ రైడర్‌గా.. ట్రావెలర్‌గా..
దీంతో వరుసగా ఐదో వారం కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతిక, ఇప్పుడు ఐదో వారంలో శుభ శ్రీ లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కాస్త కలరింగ్ తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే.. ఆ లోటు భర్తీ చేసేందుకు బిగ్‌బాస్ లాంచ్ 2.0 పేరుతో కొత్త కంటెస్టెంట్స్‌ను లోపలికి పంపుతున్నాడు బిగ్‌బాస్.