Tamannaah : తాప్సీని ట్రోల్ చేస్తూ.. మన దేశ సంస్కృతి చాటిచెప్పిందని తమన్నాని పొగిడేస్తున్న నెటిజన్లు..

తాజాగా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌ (ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌) అవార్డు కార్యక్రమానికి తమన్నా, తాప్సీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ క్రమంలో ఈవెంట్‌ నిర్వాహకులు అక్కడ ఉన్న పెద్దవారితో పాటు హీరోయిన్లు తమన్నా, తాప్సీని కూడా జ్యోతి ప్రజ్వలన చేయమన్నారు. అయితే అక్కడ ఉన్నవాళ్ళంతా.............

Tamannaah : తాప్సీని ట్రోల్ చేస్తూ.. మన దేశ సంస్కృతి చాటిచెప్పిందని తమన్నాని పొగిడేస్తున్న నెటిజన్లు..

tamannaah

Tamannaah :  అప్పుడప్పుడు మన స్టార్లు మన దేశ సంస్కృతిని చాటుతూ ప్రశంసలు అందుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కొన్ని సందర్భాల్లో మన దేశ సంస్కృతిని అగౌరవపరుస్తూ, ట్రోల్స్ చేస్తూ, నెగిటివ్ గా చూపిస్తూ ఉంటారు. ఇందుకే బాలీవుడ్ స్టార్ల సినిమాలని కూడా బాయ్ కాట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరోసారి బాలీవుడ్ స్టార్ కి, సౌత్ స్టార్ కి తేడా తెలిసింది.

తాజాగా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌ (ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌) అవార్డు కార్యక్రమానికి తమన్నా, తాప్సీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ క్రమంలో ఈవెంట్‌ నిర్వాహకులు అక్కడ ఉన్న పెద్దవారితో పాటు హీరోయిన్లు తమన్నా, తాప్సీని కూడా జ్యోతి ప్రజ్వలన చేయమన్నారు. అయితే అక్కడ ఉన్నవాళ్ళంతా చెప్పులతోనే జ్యోతి ప్రజ్వలన చేశారు.

Rajinikanth : రజినీకాంత్ 47 ఏళ్ళ సినీ ప్రస్థానం.. స్పెషల్ సెలబ్రేషన్స్ చేయించిన భార్య లతా..

హీరోయిన్ తాప్సీ కూడా చెప్పులతోనే జ్యోతి ప్రజ్వలన చేసింది. తమన్నా మాత్రం చెప్పులు తీసేసి జ్యోతి ప్రజ్వలన చేసింది. ఆ పక్కనే ఉన్న ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అడగగా ఇది భారతదేశ సంస్కృతి అని చెప్పింది తమన్నా. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా తమన్నాని అభినందిస్తూ తాప్సీని ట్రోల్ చేస్తున్నారు. తమన్నా బాలీవుడ్ లో సినిమాలు చేసినా సౌత్ లో స్టార్ గా ఎదిగి భారతదేశ సంస్కృతిని గౌరవిస్తుంది. కానీ తాప్సీ మాత్రం ఆ బాలీవుడ్ వాళ్ళ లాగే మన సంస్కృతిని చిన్న చూపు చూస్తూ ఇలా చేసింది. అందుకే బాలీవుడ్ సినిమాలని బాయ్ కాట్ చేసేది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా మన సంస్కృతిని ఆస్ట్రేలియాలో చాటి చెప్పిందని ప్రశంసిస్తున్నారు.