Adipurush : 3డీలో చూస్తే రావణాసురుడి గెటప్ మారిపోతుందా??.. ఆదిపురుష్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి..

తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ''నేను ఆదిపురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. 500 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నాం అనడంతో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. కానీ టీజర్ చాలా నిరాశ పరిచింది.................

Adipurush : 3డీలో చూస్తే రావణాసురుడి గెటప్ మారిపోతుందా??.. ఆదిపురుష్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి..

Tammareddy Bharadwaj Fires on Adipurush Teaser

Updated On : October 10, 2022 / 8:55 AM IST

Adipurush :  ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తీస్తున్నామని చెప్పి అసలు టీజర్లో రామాయణం పాత్రలే లేకుండా చేశారు. రాముడు, హనుమంతుడు, రావణాసురుడు అన్ని గెటప్స్ ని కొత్తగా చూపించారు. అసలు వారి స్వరూపాలే మార్చేశారు. దీంతో ఆదిపురుష్ టీజర్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందువులు భారీగా ఈ సినిమా టీజర్ ని, దర్శకుడ్ని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ అభిమానులేమో 500 కోట్ల బడ్జెట్ అని చెప్పి బొమ్మల సినిమా తీస్తున్నారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆదిపురుష్ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఆదిపురుష్ గురించి విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ”నేను ఆదిపురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. 500 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నాం అనడంతో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. కానీ టీజర్ చాలా నిరాశ పరిచింది. ఓ యానిమేటెడ్ సినిమాని పెద్ద సినిమా అని ఎలా అంటారో నాకు అర్ధం కావట్లేదు. నాకు తెలిసినంతవరు 3డీలో చేసినా, 4డీ చేసినా, 2డీ చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ మూవీని రజనీకాంత్‌ తీసిన కొచ్చాడియన్‌లా ఉందని చాలా మంది అంటున్నారు. సినిమా యూనిట్ దీనిపై మాట్లాడితే 3డీ థియేటర్లో ఎక్స్‌పీరియస్‌ వేరుగా ఉంటుందని అంటున్నారు. 3డీలో చూస్తే వారి గెటప్స్, కాస్ట్యూమ్స్ మారిపోతాయా? ఎందులో చూసినా అదే కదా.”

Divi Vadthya : చిరంజీవి కారు దిగి వచ్చి మా అమ్మ నాన్నలకి ఫోటో ఇచ్చారు..

”రాముడిని దేవుడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. రావణాసురుడు బ్రాహ్మణుడు, ఆయనకి కూడా మన దేశంలో దేవాలయాలు ఉన్నాయి. కానీ టీజర్ లో ఎలా చూపించారు. అడిగితేనేమో 3డీలో చూడండి అంటున్నారు. అందులో చూస్తే రావణాసురుడు కనపడతాడా, వాళ్ళు డిజైన్ చేసిన పాత్రే కదా కనిపించేది. సినిమా చూశాక నచ్చుతుంది అంటున్నారు. ఏం చూపిస్తారో చూడాలి మరి. రామాయణాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. అందరు సినిమా బాగుండాలనే కోరుకుంటున్నారు” అని అన్నారు.