Tollywood: టాలీవుడ్‌లో అమల్లోకి రానున్న కొత్త మార్గదర్శకాలు.. విడుదల చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

టాలీవుడ్‌లో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు కూడా మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌. ఆ ప్రకటనలో నటీనటుల రెమ్యూనరేషన్ లు, కాల్‌ షీట్లు వివరాలు, ఓటీటీ-శాటిలైట్‌ హక్కులు వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలని విడుదల చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలివే..

Tollywood: టాలీవుడ్‌లో అమల్లోకి రానున్న కొత్త మార్గదర్శకాలు.. విడుదల చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

Telugu Film Chamber Releases New Rules in Tollywood..

Tollywood: టాలీవుడ్‌లో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు కూడా మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌. ఆ ప్రకటనలో నటీనటుల రెమ్యూనరేషన్ లు, కాల్‌ షీట్లు వివరాలు, ఓటీటీ-శాటిలైట్‌ హక్కులు వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలని విడుదల చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలివే..

సినిమా నిర్మాణం..
-> ఇక నుంచి నటులకు మరియు సాంకేతికనిపుణులకు రోజువారీ వేతనాలు కాకుండా రెమ్యూనరేషన్ తరహాలో చెల్లింపులు.
-> నటినటుల పర్సనల్‌ స్టాఫ్‌, ప్రత్యేక ఆహారం, లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, బస, తదితరాలన్నింటినీ కలుపుకొనే నటినటుల రెమ్యూనరేషన్‌.
-> ముఖ్య సాంకేతికనిపుణుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ విషయం గాను సినిమాల షూటింగ్ మొదటిలోనే అగ్రిమెంట్‌ చేసుకోవాలి.
-> స్క్రిప్టు అప్‌డేట్స్‌, కాల్‌ షీట్లు వంటి వివరాలను ప్రతిరోజూ నోట్‌ చేయాలి.
-> ఫిల్మ్‌ ఛాంబర్‌ లో తప్పనిసరిగా సినిమా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Hero Nikhil : కార్తికేయ 2 హిట్‌తో నిఖిల్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ ఆఫర్లు..

డిజిటల్/శాటిలైట్..
-> థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే సినిమా ఓటీటీలో విడుదల చేయాలి.
-> ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు ఏ సంస్థలు దకించుకున్నవి అన్న వివరాలు సినిమా టైటిల్స్‌లో కాని, ప్రచారంలో కాని తెలపకూడదు.

థియేట్రికల్‌, ఎగ్జిబిషన్‌..
-> వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6న మరోసారి ఈ అంశంపై భేటీ కానుంది ఫిల్మ్‌ ఛాంబర్‌.

వర్కర్స్ ఫెడరేషన్‌..
-> వర్కర్స్ రేట్‌ కార్డుల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తుదినిర్ణయం అనంతరం రేట్‌ కార్డుల వివరాలను అన్ని నిర్మాణ సంస్థలకు అందించనున్నారు.