Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు

'అఖండ' ఇచ్చిన ఊపుతో అన్ని సినిమాలు మళ్ళీ క్యూ కడుతున్నాయి. ఈ వారం యువ హీరో నాగశౌర్య నటించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘లక్ష్య’ డిసెంబర్‌ 10న థియేటర్లలో......

Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు

Movies (1)

Movies :  గత రెండు వారాల నుంచి పెద్ద సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చిన్న చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలు మొదలవుతుండటంతో మళ్ళీ పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది.

Kamal Hassan : కమల్‌హాసన్‌పై సీరియస్.. స్టాలిన్ సర్కార్ నోటీసులు

థియేటర్ లో :

‘అఖండ’ ఇచ్చిన ఊపుతో అన్ని సినిమాలు మళ్ళీ క్యూ కడుతున్నాయి. ఈ వారం యువ హీరో నాగశౌర్య నటించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘లక్ష్య’ డిసెంబర్‌ 10న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఇందులో ‘రొమాంటిక్’ సినిమాతో కుర్రకారుని మత్తెక్కించిన కేతిక శర్మ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇటీవలే నాగశౌర్య ‘వరుడు కావలెను’ సినిమాతో వచ్చాడు. ఆ సినిమా నిరాశపరిచింది. మరి ‘లక్ష్య’తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.

నాలుగు రకాల కథలు కలిపి వాటిని ఎక్కడో ఒక చోట లింక్ పెట్టి ఒక సినిమాగా తెరకెక్కించే సినిమాలు ఇటీవల వస్తున్నాయి. ఆలాంటి సినిమానే ‘గమనం’. శ్రియ, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మీనన్‌, సుహాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్‌ 10న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘నయీమ్ డైరీస్’ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ అవ్వనుంది.

దేశంలోనే మొదటి సారి మడ్‌ రేసింగ్‌ స్టోరీతో రాబోతున్న ‘మడ్డి’ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా డిసెంబర్ 10న రిలీజ్ అవుతుంది.

ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం లాంటి చిన్న చిత్రాలు కూడా డిసెంబర్‌ 10న థియేటర్లలో రానున్నాయి.

VJ Sunny : సన్నీకి అత్త అవ్వాల్సింది.. పిన్ని అయ్యాను

ఓటిటిలో :

తెలుగు ఓటిటి ఆహాలో ఈ వారం ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా డిసెంబర్‌ 10న రిలీజ్ అవ్వబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ద ఎక్స్‌పాన్స్‌ వెబ్‌ సిరీస్‌ 6వ సీజన్‌, హాలీవుడ్ మూవీ ఎన్‌కౌంటర్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వనున్నాయి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో హిందీ వెబ్ సిరీస్ ఆర్య డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో టైటాన్స్‌ వెబ్‌సిరీస్‌ 3వ సీజన్‌ డిసెంబరు 8న, హిందీ సిరీస్ అరణ్యక్‌, హాలీవుడ్ సినిమా ద అన్‌ ఫర్‌గివబుల్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతున్నాయి.

జీ5 లో హిందీ సిరీస్ కాతిల్‌ హసీనోంకే నామ్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతుంది.