Shooting Updates : లైట్స్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..

లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడు షూటింగ్స్ పున: ప్రారంభమయ్యాయి..

Shooting Updates : లైట్స్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..

Shooting Updates

Shooting Updates: కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రోజువారీ వర్కర్ల పరిస్థితి వర్ణనాతీతం. లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడు షూటింగ్స్ పున: ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుందో చూద్దాం.

‘ఆర్ఆర్ఆర్’ మూవీ సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతుంది..
రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ షూట్ జరుగుతోంది..
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ CBIT కాలేజ్ పరిసర ప్రాంతంలో వేసిన సెట్‌లో జరుగుతుంది..
నాగ చైతన్య – విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది..
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీ శామీర్ పేట్‌లో జరుగుతుంది..
విశాల్ కొత్త సినిమా షూట్ బేగం పేటలో జరుగుతోంది..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న ‘గని’ మూవీ షూటింగ్ తారామతి బారదారిలో జరుగుతోంది..
నాగ శౌర్య – రీతు వర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘వరుడు కావలెను’ షూట్ ఫిలిం నగర్‌లో జరుగుతుంది..
అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జూలై అయిదు నుంచి భూత్ బంగ్లాలో జరుగనుంది..
బాలయ్య ‘అఖండ’ జూలై ఒకటి నుంచి గండిపేటలో 40 రోజుల షెడ్యుల్ జరుగనుంది..
పవన్ కళ్యాణ్, రానా సినిమా అయ్యప్పన్ కోషియం రీమేక్ జూలై ఫస్ట్ వీక్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగనుంది..
‘ఎఫ్3’ సినిమా షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో.. మహేష్ ‘సర్కారు వారి పాట’ జూలై ఏడు నుంచి హైదరాబాద్‌లో జరుగనుంది..