Bimbisara : అసలు ఎవరీ ‘బింబిసార’? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్..

కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘బింబిసార’ కు స్పూర్తి అయిన బార్బేరియన్ కింగ్ గురించి ఆసక్తికర విషయాలు..

Bimbisara : అసలు ఎవరీ ‘బింబిసార’? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్..

Nkr

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ స్టెప్ తీసుకున్నారు. హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ.. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో.. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాకి ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారు. ‘బన్నీ’, ‘భగీరథ’ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Bimbisara Movie

పోయిన సంవత్సరం (మే 28)న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. పాండమిక్ టైంలో పెద్దగా అప్‌డేట్ లేదు కానీ రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేసి అందరికీ సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చారు టీం. టీజర్ విజువల్‌గా బాగుండడంతో పాటు ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ప్రూవ్ చేసుకున్న కళ్యాణ్ రామ్ కింగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండడంతో అందరూ అసలు ఎవరీ ‘బింబిసార’ అని ఆరా తీయడం మొదలెట్టారు. రీసెర్చ్ చేస్తే అతనో బార్బేరియన్ కింగ్ అని తెలిసింది.

BIMBISĀRA: పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. బింబిసార హై ఓల్టేజ్ టీజర్

‘బింబిసార’ ఎవరంటే..

క్రీస్తు పూర్వం 558 BC, 491 BC మధ్య కాలంలో ‘5వ శతాబ్ధం చివరి కాలంలో) బింబిసారుడుని గురించిన ప్రస్తావన ఉంది. ఆయన మగధ సామ్రాజ్యానికి రాజైన భట్టియా కుమారుడు. ఒక జైన ముని ప్రశాంతతకు ఆకర్షితుడై జైనమతి భక్తుడిగా మారతాడు. భట్టియా తన 15వ ఏట సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన హర్యంక రాజవంశానికి చెందినవాడు. రాజ్యాధికారం కోసం జరిగిన పోరాటంలో భట్టియా, బ్రహ్మదత్త చేతిలో ఓటమి పాలవుతాడు.

Nkr Bimbisara

దాంతో బింబిసార తన తండ్రిని ఓడించిన బ్రహ్మదత్తపై పగ తీర్చుకోవాలనుకుని యుద్ధంలో అతణ్ణి ఓడించి అంగారాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. తన రాజ్యానికి చుట్టుపక్కల గల రాజ్యాలను కూడా స్వాధీనం చేసుకుంటాడు. అధికారికంగా ఆయనకు ముగ్గురు భార్యలున్నారని చెప్తున్నా.. మహావగ్గ మాత్రం బింబిసారుడికి 500 మంది భార్యలున్నారని రాసుకొచ్చాడు. ఇక తనదైన తిరుగులేని పాలన అందించిన బింబిసార చివరకు పదవీ వ్యామోహం కలిగిన కన్నకొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోవడం అనేది ఆయన జీవితంలో ఊహించని ఘటన.