Sabari Movie: లేడీ లీడ్‌గా జయమ్మ.. పాన్ ఇండియా సినిమాగా ‘శబరి’

ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి వరలక్ష్మీ శరత్ కుమార్. 'క్రాక్'లో నెగెటివ్ రోల్ చేసి మెప్పించిన వరలక్ష్మి.. 'నాంది'లో న్యాయవాదిగా ఆకట్టుకున్నారు. ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం..

Sabari Movie: లేడీ లీడ్‌గా జయమ్మ.. పాన్ ఇండియా సినిమాగా ‘శబరి’

Sabari Movie

Sabari Movie: ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ‘క్రాక్’లో నెగెటివ్ రోల్ చేసి మెప్పించిన వరలక్ష్మి.. ‘నాంది’లో న్యాయవాదిగా ఆకట్టుకున్నారు. ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న ఈమెకు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అభిమానులు ఉన్నారు. వాళ్ళ ముందుకు మరో సరికొత్త పాత్రతో ‘శబరి’గా రావడానికి వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్ధమయ్యారు. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.

Varalaxmi Saratkumar : వరుస సినిమా ఆఫర్లతో హైదరాబాద్‌కి మకాం మార్చిన తమిళ స్టార్

అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. సోమవారం పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత ‘నాంది’ సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. సినిమా ప్రారంభమైన సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

Varalaxmi Sarathkumar: బచ్చన్ ఫ్యామిలీతో ‘జయమ్మ’.. పిక్స్ వైరల్!

దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ ‘క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు తదితరులు ఇతర తారాగణం. గోపిసుందర్ స్వరాలు చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో దర్శకుడిగా నా తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేంద్రనాథ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Varalaxmi Sarathkumar : వైరల్ అవుతున్న వరలక్ష్మి పోస్ట్

చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ‘వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త పాత్ర ‘శబరి’లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తాం’ అని చెప్పారు.