RGV: క్యాసినో కింగ్ ని కలిసిన వర్మ.. మరో బయోపిక్ కోసమేనా?
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు "రాంగోపాల్ వర్మ". ఈ డైరెక్టర్ సినిమా తీసినా, మాట్లాడినా, చివరికి ఒకరిని కలిసినా అది వివాదానికి నాంది కావాల్సిందే. తాజాగా ఈ దర్శకుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ తో భేటీ కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల...

Varma met the casino king Chikoti Praveen
RGV: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు “రాంగోపాల్ వర్మ”. ఈ డైరెక్టర్ సినిమా తీసినా, మాట్లాడినా, చివరికి ఒకరిని కలిసినా అది వివాదానికి నాంది కావాల్సిందే. తాజాగా ఈ దర్శకుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ తో భేటీ కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల క్యాసినో మరియు హవాలా డబ్బులు చేతులు మార్చే విషయంలో ప్రవీణ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
RGV : సంచలనం రేపుతున్న ఆర్జీవీ ‘వ్యూహం’
ప్రవీణ్ ఫామ్ ఆఫ్ కి వెళ్లిన రాంగోపాల్ వర్మ అక్కడి జంతువులను పక్షులను ఫోటో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రవీణ్ జీవన శైలి గురించి చెప్పుకొచ్చాడు. అయితే క్యాసినో వ్యవహారంలో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల భాగ్యస్వామ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్.. తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే అందరి బండారాలు బయటపెడతానని బెదిరిస్తున్న సమయంలో వర్మ భేటీ ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. వర్మ చీకోటి ప్రవీణ్ బయోపిక్ తీయబోతున్నాడా? అసలు వాళ్ళిద్దరూ ఏ విషయమై చర్చించుకున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినీ రాజకీయ రంగాన్ని కలవర పెడుతున్నాయి.
కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన రాంగోపాల్ వర్మ.. తాను త్వరలో ఏపీ రాజకీయాల ఆధారంగా ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. అది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉంటాయి కానీ రియల్ పిక్ లో నిజాలే ఉంటాయని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటిది ‘వ్యూహం’, రెండవది ‘శపధం’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
On the whole had a FANTASTIC time with Chikoti Praveen and his EXOTIC WILD ANIMALS ??? pic.twitter.com/XlkhN0fgVn
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022