శ్రద్ధా కపూర్‌ని ప్రేమించాను.. కానీ చెప్పలేకపోయాను: వరుణ్ ధావన్

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 04:14 AM IST
శ్రద్ధా కపూర్‌ని ప్రేమించాను.. కానీ చెప్పలేకపోయాను: వరుణ్ ధావన్

టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన సినిమా Baaghi-3 ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అదేంటంటే.. అతనికి శ్రద్ధా అంటే చాలా ఇష్టమని. అది ఈ మధ్యలో పుట్టిన ప్రేమ కాదండోయ్.. చిన్ననాటి క్రష్ అట. కానీ, ఆయన శ్రద్ధాను ప్రేమించిన విషయం ఆమెతో ఇప్పటివరకు చెప్పలేపోయారట. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన మనసులో ఉన్న మాటని బయటపెట్టాడు. ఈ విషయం తెలిసి శ్రద్ధా షాక్ అయ్యింది. 

నేను శ్రద్ధా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అప్పటినుంచే తనంటే నాకు చాలాఇష్టం. కానీ తనకు ఈ విషయం చెప్పాలంటే చాలా భయం వేసింది. అందుకే తనని దూరం నుంచి చూస్తూ ఆనందపడేవాడిని. నాకు శ్రద్ధలో నచ్చని విషయాలు అంటూ లేవు. తనతో నచ్చే విషయాలు అడిగితే పెద్ద లిస్టే తయారు అవుతుంది అని తెలిపారు. 

ఈ మాటలకి శ్రద్ధా.. ఫుల్ ఎమోషనల్ అయ్యింది. వరుణ్ మాటలకి ఎడ్చేసింది. వెంటనే వరుణ్ రోజ్ ఫ్లవర్ తీసుకుని మోకాల్లపై జారుకుంటు వచ్చి ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.