Varun Tej: మరోసారి యుద్ధానికి రెడీ అవుతున్న మెగా హీరో

మెగా హీరో వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ ‘గని’ బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని ఆడియెన్స్ మెచ్చే విధంగా తెరకెక్కిస్తానని వరుణ్ తేజ్ గతంలోనే వెల్లడించాడు. ఇక ఈ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వరుణ్ తేజ్ తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను వదిలాడు.

Varun Tej: మరోసారి యుద్ధానికి రెడీ అవుతున్న మెగా హీరో

Varun Tej 13 Movie To Take Off On This Date

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ ‘గని’ బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని ఆడియెన్స్ మెచ్చే విధంగా తెరకెక్కిస్తానని వరుణ్ తేజ్ గతంలోనే వెల్లడించాడు. ఇక ఈ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌‌లో వరుణ్ తేజ్ తన కెరీర్‌లోని 12వ చిత్రాన్ని ప్రారంభించాడు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్ తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను వదిలాడు.

Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?

వరుణ్ కెరీర్‌లోని 13వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను సెప్టెంబర్ 19న ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ప్రాజెక్టును కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారని.. ఇదొక వార్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోయే సినిమా అని ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరే విషయాన్ని కూడా ఆయన రివీల్ చేయలేదు.

Varun Tej: మరో ఇంట్రెస్టింగ్ రోల్‌కు వరుణ్ సై..?

దీంతో వరుణ్ తేజ్ 13వ చిత్రాన్ని ఎవరు తెరకెక్కిస్తున్నారా.. ఈ సినిమాలో నటీనటులు ఎవరా.. ఈ ప్రాజెక్టు ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ మెగా ప్రాజెక్టు అప్పుడే అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. గతంలో వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతో వస్తుండటంతో ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.