Varun Tej: IAF డే సందర్భంగా వరుణ్ తేజ్ మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్!

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల తన కెరీర్‌లోని 13వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా, శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Varun Tej: IAF డే సందర్భంగా వరుణ్ తేజ్ మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్!

Varun Tej New Movie Poster Released On IAF Day Eve

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల తన కెరీర్‌లోని 13వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా, శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Varun Tej: మరోసారి యుద్ధానికి రెడీ అవుతున్న మెగా హీరో

వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు ఇష్టపడే వరుణ్ తేజ్, మరోసారి ఈ సినిమాతో తన ప్రతిభను చాటనున్నాడు. కాగా, అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. జెట్ ఫైటర్ వైపు నడుచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్‌ను టాప్ యాంగిల్‌లో మనకు ఈ పోస్టర్‌లో చూపెట్టారు. ఈ సినిమాలో IAF ఆఫీసర్ పాత్రలో వరుణ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Varun Tej: మరో ఇంట్రెస్టింగ్ రోల్‌కు వరుణ్ సై..?

ఇక ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తుండగా, తెలుగ – హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.