Vishwaksen : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్సేన్

విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళుతుంటే ఆ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని నడిరోడ్డుపై న్యూసెన్స్ చేశాడు. విశ్వక్ కారులోంచి వచ్చి అడిగితే అల్లం అర్జున్ కుమార్..............

Vishwaksen : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్సేన్

Vishwak

Vishwaksen :  వైవిధ్యం ఉన్న కథలు సెలక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలో మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు యువ హీరో విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అని మొన్నటి దాకా అనిపించుకున్నా ఇప్పుడు క్లాస్ సినిమాలతో కూడా జనాల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో మే 6న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ప్రమోషన్స్ లో భాగంగా నడిరోడ్డుపై ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేశాడు విశ్వక్సేన్.

 

సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఐమాక్స్ థియేటర్ వద్ద రివ్యూలు అంటూ మైక్ కనపడితే ఓవర్ యాక్టింగ్ చేసే ఓ యువకుడిని సినిమా ప్రమోషన్ కోసం తీసుకొచ్చారు. విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళుతుంటే ఆ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని నడిరోడ్డుపై న్యూసెన్స్ చేశాడు. విశ్వక్ కారులోంచి వచ్చి అడిగితే అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌ సేన్‌ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్‌. నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా అంటూ హల్ చల్ చేశాడు. విశ్వక్‌సేన్‌ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు అక్కడ డ్రామా నడిపించాడు. దీంతో కాసేపు నడిరోడ్డు మీద వీరిద్దరూ కలిసి హంగామా చేసి అక్కడి జనాలకి ఇబ్బంది కలిగించారు.

CPI Narayana : బిగ్‌బాస్ పై కంప్లైంట్ చేశాను.. పూర్తిగా బ్యాన్ చేయాలి..

ఈ వీడియోని సోషల్ మీడియా, యూట్యూబ్ లలో ప్రమోట్ చేయగా ఇది చూసిన వాళ్లంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంత నీచంగా చేయాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రాంక్ లంటూ ఈ న్యూసెన్స్‌ ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.