Indian 2: ఇండియన్-2 సినిమాలో స్టార్ క్రికెటర్ తండ్రి!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Indian 2: ఇండియన్-2 సినిమాలో స్టార్ క్రికెటర్ తండ్రి!

Yuvraj Singh Father In Kamal Haasan Indian 2 Movie

Indian 2: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.

Shankar Indian-2 Film: సఫలం కాని చర్చలు.. వివాదం మళ్ళీ మొదటికే!

కాగా ఈ సినమాలో కమల్ హాసన్ మరోసారి రెచ్చిపోయి నటించనున్నాడు. వృద్ధుడి పాత్రలో కమల్ ఎలాంటి సాహసాలు చేస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో ఓ మాజీ స్టార్ క్రికెటర్ తండ్రి కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఉత్తరాదిన కొన్ని సినిమాల్లో నటించాడు. ఆయన్ను ‘ఇండియన్-2’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ ఓకే చేసింది. ఈ సందర్భంగా ‘ఇండియన్-2’ లాంటి సినిమాలో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లుగా యోగ్‌రాజ్ సింగ్ వెల్లడించారు.

Kamal Haasan: విక్రమ్ ఎఫెక్ట్ ఇండియన్-2పై చూపిస్తోన్న కమల్..?

సినిమాలో పాత్ర కోసం తనను మేకప్ చేస్తున్న ఫోటోను యోగ్‌రాజ్ సింగ్ సోషల్ మీడియాలో పొస్ట్ చేశాడు. మరి క్రికెట్‌లో యువరాజ్ సింగ్ వీరబాదుడులా, ఆయన తండ్రి ఇండియన్-2 సినిమాలో ఇరగదీస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇండియన్-2 సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.