Rohtak: రికార్డుల్లో చనిపోయిన 102 ఏళ్ల వృద్ధుడు, ఊరేగింపుతో రథంపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు

హర్యానాలో ఇంత వయసుగల వృద్ధులు అతి తక్కువగా ఉన్నారని, వీరిని హర్యానాలో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇలాంటి వృద్ధులకు పెన్షన్ ఆపేయడం హేయమని అన్నారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఫ్యామిలీ ఐడీ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను అన్నీ ఉన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా, ఈ ఊరేగింపుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rohtak: రికార్డుల్లో చనిపోయిన 102 ఏళ్ల వృద్ధుడు, ఊరేగింపుతో రథంపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు

102 year old Haryana man dead in govt records shows up in chariot to prove he is alive

Rohtak: బతికున్న వ్యక్తులు ప్రభుత్వ లెక్కల్లో చనిపోతుంటారు. చనిపోయిన వ్యక్తులు బతుకుంటారు. ఇలాంటి చిత్రాలు ప్రభుత్వ రంగాల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంటుంది. అచ్చం ఇలాగే హర్యానాలోని రోహ్‭తక్‭కు చెందిన 102 ఏళ్ల దులీచంద్ వ్యక్తి చనిపోయాడని అధికారిక లెక్కల్లో రాసుంది. దీంతో చాలా ఏళ్లుగా దులీచంద్‭కు అధికారులు పెన్షన్ ఇవ్వడం ఆపేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన తొక్కని ప్రభుత్వ కార్యాలయం గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. తిరగని అధికారి లేడు.

ఇక తిరిగి తిరిగి.. తాను బతికున్నట్లు ఎలాగైనా నిరూపించుకోవడం కోసం ఒక సూపర్ ప్లాన్ ఆలోచించాడు. ‘‘నేను దూలీ చంద్. నేను బతికే ఉన్నాను’’ అని ఫ్లకార్డులు పట్టుకుని గుర్రపు బండిపై ఊరేగింపుతో ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఆయన వెంట చాలా మంది ‘దూలీచంద్ బతికే ఉన్నారు’ అని ఫ్లకార్డులు పట్టుకుని బ్యాండు మేళాల మధ్య డాన్సులు చేస్తూ రోహ్‭తక్‭లోని ప్రభుత్వ కార్యాలయానికి వచ్చారు. అనంతరం బీజేపీ ఉపాధ్యక్షుడు మనీష్ గ్రోవర్‭కి వినతిపత్రం సమర్పించి వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీనితో పాటు చనిపోయినట్లు ప్రకటించి పెన్షన్ ఆపేసిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లకు మనీష్ గ్రోవర్ అంగీకరించారు. అనంతరం విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో నవీన్ జైహింద్ మాట్లాడుతూ హర్యానాలో ఇంత వయసుగల వృద్ధులు అతి తక్కువగా ఉన్నారని, వీరిని హర్యానాలో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇలాంటి వృద్ధులకు పెన్షన్ ఆపేయడం హేయమని అన్నారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఫ్యామిలీ ఐడీ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను అన్నీ ఉన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా, ఈ ఊరేగింపుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Asaduddin Owaisi: బలహీన ప్రధానితో కిచిడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బెటర్.. మోదీ ఫిర్యాదులపై ఎద్దేవా చేసిన ఓవైసీ