కరోనా టెర్రర్.. 11మంది CISF జవాన్లకు పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్

  • Published By: veegamteam ,Published On : April 4, 2020 / 01:56 AM IST
కరోనా టెర్రర్.. 11మంది CISF జవాన్లకు పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్ చేస్తోంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టులకు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. వారేమీ విదేశాలకు వెళ్ల లేదు. అయినా వారికి కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.

ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్(central industrial security force) జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న జవాన్లు విదేశాల నుంచి వచ్చిన వారిని తనిఖీలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా భారత్ లోకి కరోనా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా ఎయిర్ పోర్టులో డ్యూటీ చేసిన 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను క్వారంటైన్ కు పంపింది. అధికారుల అనుమానం నిజమైంది. జవాన్లు కరోనా బారినపడ్డారు. క్వారంటైన్ లో ఉన్న నలుగురికి గురువారం పాజిటివ్ రాగా.. మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది.

వీరికి ప్రయాణికుల నుంచి కరోనా సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. ఐడీ కార్డులను తాకడం, వాష్ రూమ్‌లలో నీళ్ల ట్యాప్‌లను ముట్టుకోవడం వల్ల వీరికి కోవిడ్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ముందుగా ఓ జవాన్‌కు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ రాగా.. మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగటివ్ అని వచ్చింది. దీంతో మూడోసారి అతడి శాంపిళ్లను టెస్టులకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని.. అతడ్ని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచినట్లు సీఐఎస్ఎఫ్ తెలిపింది.

జవాన్లు కోవిడ్ బారిన పడటం పట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా స్పందించింది. ముందుండి దేశాన్ని రక్షించే సైనికులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్వీప్‌మెంట్ (పీపీఈ)-మాస్కులు, హజ్మత్ సూట్లు, గ్లోవ్స్ అందించాలని ప్రధాని మోడీకి ఆలిండియా మహిళా కాంగ్రెస్ సూచించింది. ఎంజిఎం ఆసుపత్రిలో జవాన్లకు చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. జవాన్లకు పాజిటివ్ అని తేలాక, సీఐఎస్ఎఫ్ క్యాంప్ ను సీల్ చేశామని, సానిటైజ్ చేశామని అధికారులు వెల్లడించారు.(రైలు కూత మోగేదెప్పుడో.. ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే? )

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరిగింది. గత ఆరు రోజుల్లోనే మూడు రెట్లయ్యాయి. మార్చి 29న దేశవ్యాప్తంగా 1024 కేసులు ఉండగా.. ఇప్పుడు 3108కు చేరాయి. శుక్రవారం(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 508 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తంగా 86మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదయ్యాయి. తర్వాత తమిళనాడులో 411 మందికి వైరస్​ సోకింది. ఆ తర్వాత ఢిల్లీలో 386, కేరళ 295, తెలంగాణ 229, రాజస్థాన్ 179, ఉత్తరప్రదేశ్ 174, ఆంధ్రప్రదేశ్ 164, మధ్యప్రదేవ్ 154, కర్ణాటక 128 కేసులు నమోదయ్యాయి. రెండ్రోజులుగా దేశంలో నమోదైన కొవిడ్ పేషెంట్లలో 647 మంది ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైనవాళ్లేనని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.