National Medical Commission : దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు ..

రద్దు అయ్యే కాలేజీల లిస్టులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా ఉంది.వీటితో పాటు అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, , త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా నిబంధనలు పాటించని కాలేజీలు ఉన్నట్లుగా గుర్తించారు.

National Medical Commission : దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు ..

National Medical Commission

150 Medical Colleges NMC  : దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానుంది. దేశంలో వైద్య విద్య, వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ అయిన నేషనల్ మెడికల్ కమిషన్ ఇప్పటికే 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. మరో 150 కాలేజీల గుర్తింపును రద్దు చేయనుంది. నిబంధనలు పాటించని మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ ఉక్కుపాదం మోపుతోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే 40 కాలేజీల గుర్తింపు రద్దు కాగా మరో 150 కాలేజీల గుర్తింపును రద్దు చేయనుంది.

రద్దు అయ్యే కాలేజీల లిస్టులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా ఉంది. వీటితో పాటు అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, , త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా నిబంధనలు పాటించని కాలేజీలు ఉన్నట్లుగా గుర్తించారు. నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నెల రోజులుగా తనిఖీలు నిర్వహిస్తోంది. సీసీ టీవీ కెమెరాలు, ఆధార్ అనుసంధాల బయోమెట్రిక్ హాజరు విధానాల్లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. మరి ముఖ్యంగా విద్యాబోధన విషయంలో పలు కాలేజీలు అద్యాపకుల కొరత ఉన్నట్లుగా గుర్తించారు.

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ తనిఖీల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధార్ లింక్ అయిన బయోమెట్రిక్, ఫ్యాకల్టీ రోల్స్ తదితర అంశాలను కూడా కూలకషంగా పరిశీలించారు. పలు కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉన్న విషయాన్ని గుర్తించింది కమిషన్.

Asaduddin Owaisi: దమ్ముంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఓవైసీ

ఈ కాలేజీల లైసెన్స్ రద్దుపై మెడికల్ కాలేజీలు 30 రోజుల వ్యవధిలో మెడికల్ కమిషన్ కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాలేజీ యాజమాన్యం చేసుకున్న అప్పీల్ ను మెడికల్ కమిషన్ తిరస్కరిస్తే… కేంద్ర వైద్య శాఖను సంప్రదించే వెసులు బాటు కూడా ఉంది. కాగా దేశ వ్యాప్తంగా 660 మెడికల్ కాలేజీలు ఉండగా వీటిలో ఎయిమ్స్ కు చెందినవి 22 ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రక్రియలో 150 కాలేజీల గుర్తింపు రద్దు అయితే… దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 25 శాతం తగ్గిపోనుంది. అదే జరిగితే వైద్య విద్య అభ్యసించే విద్యార్ధులకు ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంగా చూస్తే..2014 నుంచి మెడికల్ కాలేజీల సంఖ్యలు దాదాపు రెండు సార్లు పెరిగింది. 2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండగా 2023 నాటికి ఈ సంఖ్య 660కి పెరిగింది. వాటిలో 22 ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందినవి.