UP : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పాపం వలస కూలీలు, వలస బతుకు ఏదీ భరోసా ?

అంతా బాగుంటే మళ్లీ తిరిగొస్తాం.., లేదంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామని. వెళ్లిన వలస కూలీలను నిండు ప్రాణాలను తీసేసింది ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్నో రోజుల తర్వాత మరికాసేపట్లో సొంత ఊర్లకు చేరుకుని.. బంధువులతో ఆనందంగా గడుపుతామనే వారి ఆశలను భారీ ట్రక్కు బలితీసుకుంది.

UP : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పాపం వలస కూలీలు, వలస బతుకు ఏదీ భరోసా ?

Up Road

18 Labourers Killed : అంతా బాగుంటే మళ్లీ తిరిగొస్తాం.., లేదంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామని. వెళ్లిన వలస కూలీలను నిండు ప్రాణాలను తీసేసింది ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్నో రోజుల తర్వాత మరికాసేపట్లో సొంత ఊర్లకు చేరుకుని.. బంధువులతో ఆనందంగా గడుపుతామనే వారి ఆశలను భారీ ట్రక్కు బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న బస్సును భారీ ట్రక్కు ఢీ కొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బీహార్‌ వాసులుగా గుర్తించారు అధికారులు. బీహార్‌కు చెందిన వలసకూలీలు హర్యానా నుంచి స్వస్థలాలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read More : Dhanush : హ్యాపీ బర్త్‌డే ‘ఇళయ సూపర్‌స్టార్’..

ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ : –
వెనుకబడిన జిల్లాలే కాదు.. అభివృద్ధి చెందిన జిల్లాల్లోని.. వేలాది మంది ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ హర్యానా వెళ్లారు. మాతృభూమికి, కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా వీరంతా పొట్టచేతబట్టుకుని.. అక్కడికి వెళ్లింది. ఓ తరానికి సరిపడా సంపాదిద్దామనేం కాదు. బతుకు బండి ముందుకు వెళ్లాలని. కానీ.. వారు తిరిగి ఇంటికి చేరేదాకా గ్యారెంటీ ఉండటం లేదు. గతేడాది ప్రమాదాల కారణంగా 13వందలకు పైగా వలసకూలీలు చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కూలీ చేస్తున్న ప్రదేశంలోనో లేక వచ్చే సమయంలో యాక్సిడెంట్‌ల రూపంలోనే ఆ బతుకులకు ఎండ్ కార్డ్ పడిపోవడం బాధాకరం. ఈ చావులు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో… అంతకు మించిన రేంజ్ వలసలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు, చాలీచాలని జీతాలు, వేతనాలతో జీవించేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించడమే.. ఈ ప్రమాదాల నివారణకు ఏకైక మార్గం అంటున్నారుర.

Read More : Best friendship : స్నేహితుడి కోసం కాడెద్దులుగా మారి…స్నేహమేరా జీవితం…స్నేహమేరా శాశ్వితం..

ఇక ప్రమాద విషయానికి వస్తే…
ట్రక్కు ఢీ కొనడంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. ఆ సమయంలో వలస కూలీలంతా బస్సు ముందు భాగంలోనే ఉండటంతో.. వారంతా మృత్యువాత పడ్డారు. మరికొందరు బస్సులోనుంచి ప్రమాదం దాటికి రోడ్డుపై ఎగిరిపడ్డారు. దీంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి గురైన డబుల్ డక్కర్ బస్సులో సుమారు వందకుపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హర్యానాకు చెందిన పాల్వాల్‌, హిసర్‌ జిల్లాల నుంచి బీహార్ వస్తున్నట్టుగా తెలిపారు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్. ప్రయాణికులంతా బీహార్‌కు చెందిన వివిధ ప్రాంతాల వారిగా గుర్తించామని.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించే పనిలో ఉన్నట్టుగా తెలిపారు ఎస్పీ యమునా ప్రసాద్‌.