Best friendship : స్నేహితుడి కోసం కాడెద్దులుగా మారి…స్నేహమేరా జీవితం…స్నేహమేరా శాశ్వితం..

అసలే అర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్న అమర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. తన పరిస్ధితిని స్నేహితుల దృష్టికి తీసుకువచ్చాడు.

Best friendship : స్నేహితుడి కోసం కాడెద్దులుగా మారి…స్నేహమేరా జీవితం…స్నేహమేరా శాశ్వితం..

Friendship (1)

Best friendship : స్నేహం విలువ తెలియని వారు ఉంటారేమో కాని స్నేహమంటే తెలియని వారుండరు. స్నేహంకోసం ప్రాణాలు ఇస్తామంటూ చాలా మంది కోతలు కోస్తుంటారు. ప్రాణాలు ఇవ్వద్దు.. కనీసం ఆపద సమయంలో ప్రాణాలు నిలబెట్టేందుకు తోడుగా నిలబడితే చాలు…అయితే అనంతరంపురం జిల్లాలో స్నేహితునికోసం మరో ఇద్దరు స్నేహితులు చేసిన సహాయం ప్రస్తుతం అందరి నుండి ప్రశంసలు అందుకుంటుంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే…

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లికి చెందిన అమర్ కు రెండున్న ఎకరం పొలం ఉంది. ఇటీవల వర్షాలుకురవటంతో 30వేలు ఖర్చు చేసి టమోటా పంట వేశాడు. పంటపొలంలో విపరీతంగా కలుపు పెరగటంతో కలుపు తొలగించటానికి కూలీలు అవసరమయ్యారు. అసలే అర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్న అమర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. తన పరిస్ధితిని స్నేహితుల దృష్టికి తీసుకువచ్చాడు.

పంటను కాపాడుకోవటం కోసం స్నేహితుడు అమర్ పడుతున్న తపన చూసిన సూరి, హరిలు తాము నీకు సహయంగా ఉంటామంటూ ముందుకు వచ్చారు. అమర్ భార్య భార్గవి కూడా అండగా ఉండటంతో అందరూ కలసి పొలంలో కలుపు తీసేందుకు సమయత్తామయ్యారు. కాడెద్దులు లేకపోవటంతో అరకకు ఇద్దరు స్నేహితులైన సూరి, హరిలు కాడెద్దులుగా మారారు.

స్నేహం కోసం వారు చేసిన సహాయాన్ని ఇప్పుడంతా మెచ్చుకుంటున్నారు. మిత్రుని కష్టం చూపి మేమున్నాం అంటు ముందుకు వచ్చిన సూరి,హరిలను అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్నేమంటే ఇలా ఉండాలని కష్టాల్లో బాధల్లో అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులని ఇందుకు వీరే నిదర్శనమంటున్నారు.